Rajahmundry Jailor : మళ్లీ సెలవుపై రాజమండ్రి జైలర్ ! ఈసారి కారణమిదే..
ఏపీలో విపక్ష నేత చంద్రబాబు అరెస్టు తర్వాత రాజమండ్రి జైల్లో చీమ చిటుక్కుమన్నా చర్చ జరుగుతోంది. దీనికి కారణం అక్కడ వీఐపీ ఖైదీగా ఉన్న చంద్రబాబే. ఆయన్ను అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు పంపిన తర్వాత అక్కడ చోటు చేసుకుంటున్న ప్రతీ పరిణామాన్నీ అంతా నిశితంగా గమనిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ గా ఉన్న రాహుల్ సెలవుపైనా చర్చ జరిగింది.
అనారోగ్యంతో బాధపడుతున్న రాహుల్ సతీమణి ఈ మధ్య చనిపోవడంతో ఆయన సెలవుపై వెళ్లిపోయారు. అనంతరం తిరిగి వచ్చి విధుల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు మరోసారి ఆయన వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్తున్నారు. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు రాహుల్ సెలవుగా వెళ్లబోతున్నారు. దీంతో రాజమండ్రి జైలర్ రాహుల్ సెలవు పై మళ్లీ చర్చ మొదలైంది. అయితే ఆయన ఈసారి తన భార్య మరణం తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాల కోసమే సెలవు పెట్టి వెళ్తున్నట్లు తెలుస్తోంది.

ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు అంటే ఈనెల 16 వరకూ రాజమండ్రి జైలర్ రాహుల్ సెలవుపై ఉంటారు. అనంతరం తిరిగి 17వ తేదీన విధుల్లో చేరతారని తెలుస్తోంది. రాహుల్ సెలవు నుంచి వచ్చే వరకూ రాజమండ్రి జైలు ఇన్ ఛార్జ్ గా డిప్యూటీ సూపరింటెండెంట్ రాజ్ కుమార్ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ మేరకు జైళ్ల శాఖ కోస్తాంధ్ర డీఐజీ రవికిరణ్ నిన్న ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో ఈ ఐదు రోజుల పాటు ఇన్ ఛార్జ్ రాజ్ కుమార్ తీసుకునే నిర్ణయాలకు ప్రాధాన్యత ఏర్పడనుంది.
రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న చంద్రబాబు తొలుత డెంగీ దోమల వల్ల ఇబ్బందులు పడ్డారు. అప్పట్లో అదే జైల్లో ఉన్న ఓ ఖైదీ కూడా డెంగీ సోకి చనిపోవడంతో చంద్రబాబు విషయంలోనూ టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా రాజమండ్రి జైల్లో చంద్రబాబు ఎండల కారణంగా డీహైడ్రేషన్ తో బాధపడినట్లు తనను కలిసిన కుటుంబ సభ్యులతో తెలిపారు. దీనిపై జైళ్ల శాఖ వివరణ ఇస్తూ అలాంటిదేమీ లేదని వెల్లడించింది.












Click it and Unblock the Notifications