Rajahmundry-Kakinada Port: రాజమండ్రి-కాకినాడ మధ్య కొత్త రైలు-షెడ్యూల్, స్టాప్ లు ఇవే..!
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి, కాకినాడ (Rajahmundry-Kakinada Port) నగరాల మధ్య ప్రతీ రోజూ ప్రయాణాలు సాగించేలా మరో కొత్త రైలు ప్రారంభం కాబోతోంది. పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు, డిమాండ్ నేపథ్యంలో ఈ రెండు కీలక నగరాల మధ్య కొత్త మెమూ రైలు సర్వీస్ ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆమోదముద్ర వేసిన ఈ కొత్త రైలు ప్రారంభ తేదీ, షెడ్యూల్, స్టాప్ లు, ఇతర వివరాలను అధికారులు ఎక్స్ లో పోస్ట్ చేశారు.
రాజమండ్రి నుంచి కాకినాడ పోర్టుకు వెళ్లే ఈ కొత్త రైలు నంబర్ 67301 ఈ నెల 27న ప్రారంభం కానుంది. అలాగే కాకినాడ పోర్టు నుంచి రాజమండ్రికి వెళ్లే కొత్త రైలు నంబర్ 67302 ఈ నెల 28న ప్రారంభం కానుంది. ఈ రెండు రైళ్లకూ ద్వారపూడి, అనపర్తి, బిక్కవోలు, మేడపాడు, సామర్లకోట, కాకినాడ టౌన్ స్టాప్ లుగా నిర్ణయించారు. ప్రతీ రోజూ రాకపోకలు సాగించేలా ఈ రైలును రూపొందించారు. రాజమండ్రిలో రాత్రి 10.40కు బయలుదేరే రైలు అర్ధరాత్రి 12.40కు కాకినాడ పోర్టు చేరుకుంటుంది. అలాగే కాకినాడ పోర్టు స్టేషన్లో ఉదయం 6.15కు బయలుదేరే రైలు ఉదయం 8.15కు రాజమండ్రి చేరుకోనుంది.

ఈ రైళ్లు ప్రధానంగా ఉదయం కాకినాడ నుంచి రాజమండ్రి బయలుదేరి వెళ్లే వారికి, అలాగే రాత్రి వరకూ పనులు ముగించుకుని తిరిగి వచ్చే కార్మికులు, ఇతర వర్గాల వారికి ఉపయోగకరంగా ఉంటాయి. అయితే రాజమండ్రి నుంచి కాకినాడ రైలు సమయాలు సాధారణంగా ప్రయాణాలు చేసే వారికి అనువుగా లేవు. అలాగే ఇవి పాసింజర్ రైళ్లు కావడంతో రాజమండ్రి-కాకినాడ మధ్య ప్రయాణం రెండు గంటలు పట్టనుంది. సాధారణంగా రెగ్యులర్ పాసింజర్ లేదా ఎక్స్ ప్రెస్ రైళ్లు కూడా ఇంత కంటే తక్కువ సమయంలోనే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణాలు సాగిస్తున్నాయి.












Click it and Unblock the Notifications