రాజ్యసభలో పోలవరంపై రగడ: వాగ్వివాదం
న్యూఢిల్లీ: పోలవరం ఆర్డినెన్స్‌పై రాజ్యసభలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పార్లమెంటు సభ్యుల మధ్య రగడ నెలకొంది. మంగళవారం ఉదయం సభ ప్రారంభంకాగానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపేందుకు జరుగుతున్న చర్చ సందర్భంగా తెలంగాణ ఎంపీలు పోలవరానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తెలంగాణ ఎంపిల నినాదాలకు ప్రతిగా ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ప్రతి నినాదాలు చేశారు. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యుడు జెడి శీలం, తెలంగాణ ఎంపి పాల్వాయి గోవర్ధన్ పరస్పరం వాగ్వివాదానికి దిగారు. వారిద్దరు కూడా కాంగ్రెసు సభ్యులు కావడం గమనార్హం.

జ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ఎంపీలకు సర్దిచెప్పేందుకు అనేకమార్లు ప్రయత్నించారు. కొద్దిసేపటికి పరిస్థితి చక్కబడటంతో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగింది. సోమవారంనాడు లోకసభలో పోలవరం ఆర్డినెన్స్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.
తెరాస సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. వారికి బిజెడి నుంచి కూడా మద్దతు లభించింది. సభ్యులు ఎంతకీ వినకపోవడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications