పవన్ కళ్యాణ్ కోసం తల్లి సురేఖతో కలిసి రేపు పిఠాపురంలో రామ్ చరణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించాలని సినీ ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతోంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ ఈసారి పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా రంగంలోకి దిగింది. ఇప్పటికీ చిరంజీవి వీడియో రిలీజ్ చేసి సోదరుడు సినిమాలలోకి బలవంతంగా వచ్చాడని, రాజకీయాల్లోకి మాత్రం ఇష్ట పూర్తిగా వచ్చాడని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మెగా హీరోలు
ప్రజా సేవను పరమావధిగా భావించి వచ్చిన పవన్ కళ్యాణ్ ను ఆదరించాలని చిరంజీవి వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం నియోజకవర్గంలో మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవి తేజ్ లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ కు తమ మద్దతును ప్రకటించారు.

పిఠాపురానికి రామ్ చరణ్
ఇదిలా ఉంటే తాజాగా రామ్ చరణ్ కూడా ట్వీట్ చేసి తన బాబాయ్ కి మద్దతును ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ను ఈ ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్ కోసం రామ్ చరణ్ పిఠాపురం వెళతారని ఎవరు ఊహించలేదు కానీ ఊహించని విధంగా రేపు ఉదయం పిఠాపురానికి వెళ్తున్నారు.
పిఠాపురంలో కుక్కుటేశ్వర ఆలయంలో పూజలు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన తల్లి సురేఖతో కలిసి పిఠాపురం వెళుతున్నారు. రేపు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుండి రాంచరణ్, సురేఖలు పిఠాపురం వెళుతున్నారు. పిఠాపురంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కుక్కుటేశ్వర ఆలయాన్ని సందర్శించనున్నారు. అంతేకాదు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
రామ్ చరణ్ పిఠాపురం పర్యటనపై ఆసక్తి
ఇక ఈ పర్యటన సందర్భంగా వారు పవన్ కళ్యాణ్ ను కలిసే అవకాశం ఉంది మరి పిఠాపురం వరకు వెళుతున్న రాంచరణ్ అక్కడ ఈ ఎన్నికల్లో తన బాబాయ్ కోసం ఏమైనా మాట్లాడతారా అన్నది తెలియాల్సి ఉంది. ఎవరు ఊహించని విధంగా రామ్ చరణ్ పిఠాపురం టూర్ ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తుంది.












Click it and Unblock the Notifications