వ్యూహం నుంచి కొత్త క్యారెక్టర్- పరిచయం అక్కర్లేదుగా

అమరావతి: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాబోతోన్న లేటెస్ట్ మూవీ.. వ్యూహం. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలను కథాంశంగా చేసుకుని తెరకెక్కుతోందీ సినిమా. దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. ఇదివరకు వంగవీటి సినిమాను నిర్మించింది ఆయనే. ఇటీవలే ఈ సినిమాలో నటిస్తోన్న పాత్రధారుల ఫొటోలను రామ్ గోపాల్ వర్మ విడుదల చేశఆరు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఆయన భార్య భారతిరెడ్డి పాత్రల ఫొటోలను రిలీజ్ చేశారు. వైఎస్ జగన్ పాత్రను తమిళనటుడు అజ్మల్‌ పోషిస్తోన్నాడు. వైఎస్ భారతి క్యారెక్టర్‌లో మానస రాధాకృష్ణన్ నటిస్తోన్నారు. దీని తరువాత వ్యూహం సినిమాకు సంబంధించిన పలు వర్కింగ్ స్టిల్స్‌ను రామ్ గోపాల్ వర్మ.. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ వచ్చారు.

Ram Gopal Varma

తాజాగా- తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి వర్కింగ్ స్టిల్ బయటికొచ్చింది. దీన్ని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ అకౌంట్‌లో కొద్దిసేపటి కిందటే పోస్ట్ చేశారు. ఎ క్యారెక్టర్ ఫ్రమ్ వ్యూహం అంటూ క్యాప్షన్‌ను జోడించారు. ఈ ఫొటోలో కనిపించిన నటుడి గెటప్ మొత్తం చంద్రబాబును పోలి ఉంది.

గెడ్డం, హెయిర్ స్టైల్, కాస్టూమ్స్.. ఇలా అన్ని విషయాల్లోనూ చంద్రబాబును స్ఫూరింపజేసేలా ఈ క్యారెక్టర్‌ను రామ్ గోపాల్ వర్మ తీర్చిదిద్దాడనేది ఫొటో చూస్తే తెలిసిపోతుంది. ఈ దసరా నాటికి సినిమా విడుదలయ్యే అవకాశం ఉందనేది ఫిల్మ్ నగర్ టాక్. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను ఈ సినిమాలో ప్రస్తావించనున్నారు రామ్ గోపాల్ వర్మ.

Ram Gopal Varma

రాష్ట్ర విభజన, నవ్యాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, జగన్ చేపట్టిన పాదయాత్ర, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించడం వంటి అంశాలను ఇందులో చేర్చారాయన. రాజకీయంగా ఈ సినిమా పెను సంచలనం సృష్టిస్తోందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. 2024 నాటి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సినిమాను తీస్తోన్నారని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+