Ramgopal Varma: పోలీసులకు వర్మ ట్విస్ట్ లు-100 ప్రశ్నల మధ్యలో వెజ్ లంచ్..!
గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న జగన్ మీద వ్యూహం పేరుతో సినిమా తీసి, దాని ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై ఎక్స్ లో అనుచిత పోస్టులు పెట్టిన టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇవాళ పోలీసు విచారణకు హాజరయ్యారు. ఒంగోలు రూరల్ ఎస్సై కార్యాలయంలో వర్మను పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ విచారణలో వర్మ కోసం పోలీసులు మొత్తం 100 ప్రశ్నలు సిద్దం చేశారు. అవన్నీ అడిగేలోపు వర్మ పోలీసులకు ట్విస్ట్ ఇచ్చారు.
గతంలో ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్ లో తనపై నమోదై కేసులో విచారణకు హాజరుకాకుండా తప్పించుకున్న రాంగోపాల్ వర్మ చివరికి హైకోర్టు ఆదేశాలతో వెనక్కి తగ్గారు. అరెస్టు చేయొద్దంటూ పోలీసులకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పోలీసుల సమన్లకు స్పందించి ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఉదయం ప్రారంభమైన విచారణ సాయంత్రం వరకూ కొనసాగే అవకాశం ఉందని ఒంగోలు రూరల్ సిఐ ఎన్ శ్రీకాంత్ బాబు వెల్లడించారు. ఈ విచారణలో ఆర్జీవోతో పాటు ఆయన లాయర్ శ్రీనివాసరావు కూడా పాల్గొంటున్నారు.

ఇవాళ జరుగుతున్న విచారణలో రాంగోపాల్ వర్మను ప్రశ్నించేందుకు మొత్తం 100 ప్రశ్నలు సిద్దం చేసినట్లు విచారణాధికారి అయిన ఒంగోలు రూరల్ సిఐ ఎన్ శ్రీకాంత్ బాబు తెలిపారు. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ కేవలం 12 ప్రశ్నలు మాత్రమే సంధించినట్లు తెలుస్తోంది. ఈ మధ్యలోనే వర్మ తనకు వెజ్ లంచ్ ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో పోలీసులు ఆయనకు ఆ మేరకు తెప్పించి ఇచ్చారు. సాయంత్రం వరకూ విచారణలో అప్పట్లో చంద్రబాబు, పవన్, లోకేష్ పై ట్వీట్లు పెట్టడం వెనుక ఎవరున్నారనే అంశంతో పాటు వైసీపీ నుంచి అందిన సహకారం, ఇతర అంశాలపై వర్మను పోలీసులు ప్రశ్నించనున్నారు.












Click it and Unblock the Notifications