మైలాన్ కంపెనీ సీఐఓగా తూర్పుగోదావరి జిల్లా వాసి
హైదరాబాద్: మరో తెలుగు తేజాన్ని ఓ బహుళజాతి కంపెనీలో అత్యున్నత పదవి వరించింది. వివరాల్లోకి వెళితే ప్రముఖ బహుళజాతి ఔషధ కంపెనీ మైలాన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీఐఓ)గా తెలుగు వ్యక్తి రామ్ కుమార్ రాయపురెడ్డి నియమితులయ్యారు.
ఈ మేరకు మైలాన్ కంపెనీ రామ్ కుమార్ నియామకాన్ని ఆదివారం ప్రకటించింది. రామ్‌కుమార్ రాయపురెడ్డి తూర్పుగోదావరి జిల్లా బానపురంలో జన్మించారు. కాకినాడ జేఎన్‌టీయూలో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం అమెరికా నార్త్ కరోలినాలోని క్లేమన్స్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేశారు.

ఆ తర్వాత ప్రముఖ ఔషధ కంపెనీ ర్యాన్‌బాక్సీ సంస్థలో సీఐఓగా విధులు నిర్వహించారు. గత 22 సంవత్సరాలుగా రామ్‌కుమార్ ఔషధ పరిశ్రమలో తన సేవలను అందిస్తున్నారు. 15 నెలల క్రితమే ఆయన మైలాన్ కంపెనీలో చేరారు. అతి తక్కువ కాలంలో రామ్‌కుమార్ కీలక పదవిని చేపట్టే అవకాశం వచ్చింది.
ఇకపై మైలాన్ కంపెనీలో ఐటీ కార్యకలాపాలను రామ్‌కుమార్ పర్యవేక్షించనున్నారు. ఇటీవలే తపారియా కుటుంబ యాజమాన్యంలోని జైఫార్మాను కొనుగోలు చేసేందుకు గాను మైలాన్ ల్యాబ్స్, ఇండియాలో 75 కోట్ల డాలర్లు (రూ. 4875 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు మైలాన్ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.












Click it and Unblock the Notifications