ఇవీ ఏర్పాట్లు: రామ్మోహన్ నాయుడు రిసెప్షన్ కోసం భారీ ఎత్తున!.. 20ఎకరాల స్థలంలో!

Subscribe to Oneindia Telugu

టెక్కలి: తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో రాణిస్తున్న ఎంపీ రామ్మోహన్ నాయుడు వివాహం ఈ నెల 14న విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లికి ఏమాత్రం తగ్గకుండా ఇప్పుడు రిసెప్షన్ ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున ప్లాన్ చేశారు.

ఇందుకోసం స్వగ్రామం నిమ్మాడలో పనులు చకచకా జరిగిపోతున్నాయి. జూన్ 18న రామ్మోహన్ నాయుడు రిసెప్షన్ కార్యక్రమం జరగనుండగా.. బాబాయ్‌లు మంత్రి అచ్చెన్నాయుడు, హరివరప్రసాద్‌, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్‌, చౌదరి బాబ్జి, యార్లగడ్డ వెంకన్నచౌదరి, అలాగే కుటుం బసభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ఎంపీ రామ్మోహన్ నాయుడు పెళ్లి విందుకు బాబు (ఫోటోలు)

వర్షకాలం నేపథ్యంలో.. ఒకవేళ భారీ వర్షం కురిసినా.. అతిథులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిమ్మాడ ఎఫ్‌సీఐ గోదాములకు సమీపంలోని 20 ఎకరాల స్థలంలో రిసెప్షన్‌ జరగనుంది. వివాహ రిసెప్షన్ కు సంబంధించిన స్టేజీ సహా ఇతరత్రా డెకరేషన్ వర్క్‌ కోసం ఒంగోలు జిల్లా అద్దంకికి చెందిన డెకరేషన్‌ బృందం 10రోజులుగా శ్రమిస్తోంది.

Rammohan naidu reception arrangements in nimmada

రిసెప్షన్ ఏర్పాట్లో భాగంగా.. సుమారు రెండు లక్షల చదరపు అడుగుల స్థలంలో భారీ షెడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈదురుగాలులకు షెడ్స్ పడిపోకుండా ఉండటానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రిసెప్షన్ ప్రాంగణంలో ఏసీ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక వందేమాతరం శ్రీనివాస్ కు చెందిన ఆర్కెస్ట్రా టీమ్ ఈ వేడుకలో సందడి చేయబోతున్నారు.

రామ్మోహన్ నాయుడు రిసెప్షన్ కు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రముఖులు చాలామంది రిసెప్షన్ కు వచ్చే అవకాశం ఉండటంతో.. కాశీబుగ్గ డీఎస్పీ సీహెచ్. వివేకానంద ముందస్తుగా తగు చర్యలు తీసుకుంటున్నారు. పార్కింగ్ సౌకర్యానికి ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు.

రామ్మోహన్ నాయుడు వివాహ రిసెప్షన్ నేపథ్యంలో.. నిమ్మాడ గ్రామం మొత్తాన్ని విద్యుద్దీపాల అలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దారు. 18న రిసెప్షన్ జరగనుండగా.. 17న నిమ్మాడలో గుర్రం బగ్గీపై రామ్మోహన్ నాయుడి ఊరేగింపు కార్యక్రమం జరగనుంది.

వంటలు అదిరిపోనున్నాయి:

రామ్మోహన్ నాయుడి పెళ్లిలో ధవళేశ్వరం నుంచి వచ్చే ప్రత్యేక వంట సిబ్బంది 15రకాల వంటలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో తాపేశ్వరం ఖాజా, చక్రపొంగళి, పనసకాయ బిర్యానీతో పాటు నాలుగు రకాల కూరలు, జిల్లా ఫేమస్ అయిన గూనచారు తదితర వంటలు చేయనున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Arrangements were going on for TDP MP Rammohan Naidu's marriage at Nimmada village on June 18th. He married the daughter of MLA Bandaru Satyanarayana
Please Wait while comments are loading...