రమ్య కేసు : పరామర్శిస్తే దౌర్జన్యాలా ; గన్ కంటే ముందు వచ్చే జగన్ ఎక్కడ : చంద్రబాబు, అచ్చెన్న ధ్వజం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీటెక్ విద్యార్థిని రమ్య ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురికావడంతో ఆమె కుటుంబాన్ని పరామర్శించడానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు నారా లోకేష్ తో పాటుగా, మాజీ మంత్రులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. లోకేష్ ను ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు, మాజీ మంత్రులు నక్క ఆనంద్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను సైతం అరెస్ట్ చేసి వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో పరామర్శకు వెళితే టీడీపీ నేతల పై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోలీసుల తీరుపై ధ్వజమెత్తారు. బాధిత కుటుంబాలను పరామర్శించటం కూడా తప్పేనా అంటూ నిలదీశారు.

పోలీసులపై చర్యలు తీసుకోండి , కోటి రూపాయల పరిహారం ఇవ్వండి : చంద్రబాబు డిమాండ్

పోలీసులపై చర్యలు తీసుకోండి , కోటి రూపాయల పరిహారం ఇవ్వండి : చంద్రబాబు డిమాండ్

గుంటూరులో హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తాజా ఘటనతో మహిళల రక్షణపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ది ఉందో తెలుస్తుందని విమర్శించిన చంద్రబాబు గుంటూరులోనే సీసీ కెమెరాలు పని చేయలేదు అంటే అర్థం ఏమిటని ప్రశ్నించారు. ఇదే సమయంలో పరామర్శించడానికి వెళ్ళిన టిడిపి నేతలపై దౌర్జన్యానికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

గన్ను కంటే ముందు వచ్చే జగన్ ఎక్కడ : అచ్చెన్నాయుడు

గన్ను కంటే ముందు వచ్చే జగన్ ఎక్కడ : అచ్చెన్నాయుడు

ఇదే సమయంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం జగన్ సర్కార్ పై, పోలీసుల తీరుపై ధ్వజమెత్తారు. ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన దళిత కుటుంబానికి 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటే ఆ కుటుంబానికి న్యాయం జరిగినట్టా అంటూ అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆడబిడ్డకు కష్టమొస్తే గన్ను కంటే జగన్ ముందు వస్తాడని చెప్పిన వైసీపీ నేతలు, బీటెక్ విద్యార్థిని నడిరోడ్డుపై హత్య చేస్తే తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు. మహిళలకు రక్షణ కల్పించలేని పోలీసు వ్యవస్థ, టిడిపి నేతలపై దౌర్జన్యాలను చేయడానికి మాత్రం పని చేస్తోందని మండిపడ్డారు.

టీడీపీ నేతల అరెస్ట్ పై ఉన్న శ్రద్ధ మహిళా రక్షణపై లేదు : అచ్చెన్న

టీడీపీ నేతల అరెస్ట్ పై ఉన్న శ్రద్ధ మహిళా రక్షణపై లేదు : అచ్చెన్న

బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన టిడిపి నేతలను అరెస్టు చేయడంలో కనబరుస్తున్న పోలీసుల పనితీరు మహిళలను కాపాడడంలో కనిపించడంలేదని నిప్పులు చెరిగారు. ప్రశ్నించే ప్రజా గొంతును నొక్క యాలని ప్రయత్నం చేస్తున్న వారు మట్టిలో కలిసిపోతున్నారని మండిపడ్డారు. పరామర్శ కు వెళ్లిన టిడిపి నాయకులను కావాలని పోలీసులు అరెస్టు చేశారని నిప్పులు చెరిగారు అచ్చెన్నాయుడు. గుంటూరు కాకాని లో నడి రోడ్డు మీద పట్టపగలు అందరూ చూస్తున్న సమయంలో బీటెక్ చదువుతున్న రమ్య అనే విద్యార్థిని పై ప్రేమోన్మాది కత్తితో దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. ప్రేమోన్మాది దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆసుపత్రికి తరలించే లోపే ఆమె మరణించింది.

అధికార ప్రతిపక్షాల మధ్య రమ్య హత్యకేసు రగడ

అధికార ప్రతిపక్షాల మధ్య రమ్య హత్యకేసు రగడ

ఈ ఘటనలో పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన శశి కృష్ణ అనే యువకుడిని అరెస్టు చేశారు. శశి కృష్ణకు, రమ్య కు మధ్య ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఉందని, గత ఆరు నెలలుగా వారిద్దరూ ఇన్స్టాగ్రామ్ ద్వారా మాట్లాడుకుంటున్నారని వెల్లడించిన పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. రమ్య పై దాడి జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న ప్రజలు వెంటనే స్పందించి ఉంటే, నిందితుడిని అడ్డుకుని ఉంటే రమ్య ప్రాణాలు పోయేవి కాదని పోలీసులు వెల్లడించారు. సోషల్ మీడియా పరిచయాల కు దూరంగా ఉండాలని కూడా విజ్ఞప్తి చేశారు. రమ్య హత్యోదంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల మధ్య వార్ కు తెర తీసింది. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ నేతల పరామర్శ, ఉద్రిక్త పరిస్థితుల మధ్య టిడిపి నేతల అరెస్టులు రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని మరింత పెంచాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+