'వంగవీటి'లో ఆ సన్నివేశాలు తొలగించకుంటే..: వర్మపై హెచ్చార్సీలో ఫిర్యాదు
వంగవీటి చిత్రం పైన రంగా అభిమానులు మానవ హక్కుల కమిషన్‌కు శనివారం నాడు ఫిర్యాదు చేశారు. ఓ వర్గం మనోభావాలను కించపరిచేలా 'వంగవీటి' సినిమాను చిత్రీకరించారని వారు హెచ్చార్సీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
హైదరాబాద్: వంగవీటి చిత్రం పైన రంగా అభిమానులు మానవ హక్కుల కమిషన్‌కు శనివారం నాడు ఫిర్యాదు చేశారు. ఓ వర్గం మనోభావాలను కించపరిచేలా 'వంగవీటి' సినిమాను చిత్రీకరించారని వారు హెచ్చార్సీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
సినిమా టైటిల్‌తో పాటు కాపులను కించపరిచే సన్నివేశాలను వెంటనే తొలగించాలని రంగా అభిమానులు విజ్ఞప్తి చేశారు. ఈ సినిమాలో ఓ వర్గాన్ని రౌడీ షీటర్లుగా చిత్రీకరించారని వారు ఆరోపించారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సినిమాలో అభ్యంతరకర దృశ్యాలను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామన్నారు. వంగవీటి అభిమానుల ఫిర్యాదు నేపథ్యంలో హెచ్చార్సీ.. వచ్చే నెల 16వ తేదీలోగా తమకు నివేదిక అందజేయాలని సెన్సార్ బోర్డుకు సూచించింది.

కాగా, వంగవీటి సినిమాను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించారు. ఈ సినిమా శుక్రవారం నాడు విడుదలయింది. సినిమా పైన తమకు అభ్యంతరాలు ఉన్నాయని వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ నిన్న (శుక్రవారం) ఏపీ డీజీపీ సాంబశివ రావును కలిసిన విషయం తెలిసిందే.
వంగవీటి సినిమా పైన రంగా అభిమానులు మండిపడుతున్నారు. అసలు ఈ సినిమాకు, రంగాకు ఎలాంటి సంబంధం లేదని, మా తాతల చెప్పినట్లు ఈ సినిమాలో ఏమీ లేదని అంటున్నారు. రంగాను ఒక రౌడీగా చూపించారని, కేవలం డబ్బు కోసమే వర్మ ఈ సినిమా తీసారని మండిపడుతున్నారు.
కేవలం డబ్బు కోసం, తన స్వార్థం కోసం, చీప్ పబ్లిసిటీ కోసం రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా తీశారని, అలాంటి సినిమాకు 'వంగవీటి ' టైటిల్ పెట్టడం దుర్మార్గ మని అంటున్నారు. ఇదో అర్థం లేని సినిమా, వ్యాపారం కోసం తీసిని సినిమా అని, ఇలాంటి సినిమాకు 'వంగవీటి' ఇంటి పేరు పెట్టి పరువు తీసారని రంగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications