తిరుమలలో ఆ రోజున అరుదైన ఘట్టం
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల.. ఓ అరుదైన ఘట్టానికి వేదిక కానుంది. ఈ కలియుగ వైకుంఠంలో ఓ మినీ బ్రహ్మోత్సవం జరుగనుంది. ఒకే రోజున శ్రీవారు సప్త వాహనాలపై ఊరేగనున్నాడు. బ్రహ్మోత్సవ సమయంలో నిర్వహించే వాహనసేవలన్నీ కూడా ఒకేరోజున భక్తుల ముందు సాక్షాత్కారం కానున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలోని పద్మావతి విశ్రాంతి గృహంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
అదే రథసప్తమి. ఈ నెల 25న తిరుమలలో ఈ వేడుకలు కన్నుల పండువగా జరుగనున్నాయి. వైకుంఠ ద్వార దర్శనాలను అన్ని విభాగాల సమన్వయంతో విజయవంతం చేసిన నేపథ్యంలో.. అదే స్ఫూర్తితో రథ సప్తమి పర్వదినాన్ని అద్భుతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని వెంకయ్య చౌదరి ఆదేశించారు. టీటీడీ, విజిలెన్స్ సెక్యూరిటీ, పోలీసులతో సమన్వయం చేసుకుని ముందస్తుగా భక్తుల రద్దీని అంచనా వేసుకుని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ట్రాఫిక్, పార్కింగ్ , అత్యవసర టీమ్స్ లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. సమగ్ర బందోబస్తు పై ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, ఘాట్ రోడ్డు వాహనాల కదలికను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో వాహనాలను తరలించడానికి వీలుగా కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు. ఇంజినీరింగ్, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, శ్రీవారి సేవకులు, వైద్య బృందాలు, ఎల్ ఈ డీ స్క్రీన్లు, పుష్పాలంకరణ, సాంస్కృతిక కళా బృందాలు, ఎస్వీబీసీ, సోషియల్ మీడియాలో ప్రచారం ఇతర ఏర్పాట్లపై సమీక్షించారు.
వాహనసేవల వివరాలు :
- రథసప్తమి రోజు తెల్లవారుజామున 5.30 నుంచి ఉదయం 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనాలపై శ్రీదేవి, భూదేవితో కలిసి శ్రీమలయప్ప స్వామివారు ఊరేగుతారు. భక్తులను కటాక్షిస్తారు.
- మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2 వరకు హనుమంత వాహనంపై ఉభయ దేవేరులతో కలిసి స్వామివారు ఊరేగుతారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం జరుగుతుంది. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహన సేవలను నిర్వహిస్తారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ జరుగుతుంది.
- ఈ వేడుకల నేపథ్యంలో పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దయ్యాయి. అలాగే ఎన్నారై, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలు కూడా టీటీడీ రద్దు చేసింది.
- ఈ నెల 24 నుండి 26వ తేది వరకు తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ రద్దయింది. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దయ్యాయి. దీంతో బ్రేక్ దర్శనాలకు సంబంధించి 24వ తేదీన ఎలాంటి సిఫార్సు లేఖలను కూడా టీటీడీ స్వీకరించదు.
-
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications