కాల్చి చంపేస్తారు: చంద్రబాబు-పవన్ కళ్యాణ్‌లపై జగన్ మామ తీవ్ర వ్యాఖ్య
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసిపి ప్లీనరీలో ఆయన మాట్లాడారు.
కడప: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసిపి ప్లీనరీలో ఆయన మాట్లాడారు. పవన్ ప్యాకేజీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు.

గల్ఫ్ కంట్రీల్లో కాల్చి పారేస్తారు
తెలుగు ప్రజలను కులాలవారీగా విడగొట్టి చంద్రబాబు అధికారాన్ని చేపట్టారని విమర్శించారు. ఇలాంటి తప్పుడు హామీలు ఇచ్చే నాయకులను గల్ఫ్ దేశాల్లో బహిరంగంగా కాల్చి చంపుతారని చంద్రబాబుపై కూడా తీవ్ర విమర్శలు చేశారు.

95 శాతం టిడిపికి వ్యతిరేకంగా..
చంద్రబాబు పోలీస్ రక్షణ దాటి బయటకు వస్తే ప్రజలే ఆ శిక్షను అమలు చేస్తారని రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఇటీవల చేసిన ఒక సర్వేలో రాష్ట్రంలోని 95 శాతం మంది ఓటర్లు టిడిపికి వ్యతిరేకంగా ఉన్నట్లు తేలిందన్నారు.

లోకేష్‌కు అంత సీన్ లేదు
మంత్రి నారా లోకేష్‌కు పాలనా సామర్థ్యం లేదని రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. లోకేష్ నేరుగా ఎన్నికలకు వెళ్లి కనీసం వార్డు సభ్యుడిగా కూడా గెలవలేరని వైసిపి నేతలు ఎద్దేవా చేశారు.

రాహుల్ గాంధీ గో బ్యాక్ అంటూ నిరసన
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా గుంటూరు మార్కెట్ సెంటర్ హిందూ కళాశాల కూడలి వద్ద టిడిపి కార్యకర్తలు నిరసన చేపట్టారు. రాహుల్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందని, రాహుల్ గాంధీ రాష్ట్రంలోకి అడుగుపెట్టే ముందుకు తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్, వైసిపి కలిసి ప్రజలను మోసంగించే ప్రయత్నాలు చేస్తున్నాయని వారు మండిపడ్డారు. ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదాపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు.
-
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications