నాశనం: కేసీఆర్‌పై కేఈ ఫైర్, జగన్‌కు మరికొందరు షాక్!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మంగళవారం తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. కేసీఆర్ దుర్మార్గంతో రాయలసీమ ప్రాంతం నాశనమవుతోందని ధ్వజమెత్తారు. కేసీఆర్ శ్రీశైలం వద్ద అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటంతో సీమ ప్రాంతం తీవ్రంగా నష్టపోతోందన్నారు.

కృష్ణా బోర్డుకు పూర్తి అధికారాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుచూపుతో వ్యవహరించి ఏపీలో విద్యుత్ కొరత లేకుండా చేశారన్నారు. కేసీఆర్‌కు ఆ ముందుచూపు లేకుండా పోయిందన్నారు. ఏపీ ప్రభుత్వం అంతా చట్టబద్ధంగా వ్యవహరిస్తోందన్నారు.

Rayalaseema is losing: KE on KCR

శ్రీశైలం డ్యాంను పరిశీలించిన కేంద్ర జలవనరుల నిపుణుల బృందం

శ్రీశైలం డ్యాంను కేంద్ర జలవనరుల నిపుణుల బృందం మంగళవారం పరిశీలిచింది. రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజినీర్‌ సుబ్బారావు నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యులు డ్యాం క్రస్ట్‌ గేట్లను పరిశీలించారు. స్పిల్‌వే పెంపు వివరాలను సభ్యులు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రిజర్వాయర్‌ ఖాళీ చేస్తే తప్ప డ్యామ్‌ మరమ్మతులు సాధ్యం కాదని నిపుణులు భావిస్తున్నారు. డ్యాంకు అదనంగా మరో గేటును ఏర్పాటు చేయాలా లేక స్వరంగ మార్గం ద్వారా నీటిని దిగువకు విడుదల చేయాలా అన్న దానిపై కమిటీ కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.

రైతు కుటుంబాలకు టీడీపీ ఆర్థిక సాయం

తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేసేందుకు తెలుగుదేశం పార్టీ సంకల్పించింది. మంగళవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో భేటీ అయిన తెలంగాణ టీడీపీ నేతలు ఈ మేరకు తీర్మానించారు.

రూ.2 కోట్ల నిధిని ఏర్పాటు చేసి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థికంగా సహాయం చేయాలని వారు నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ కోతల నేపథ్యంలో పంటలు ఎండిపోయిన నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురవుతున్న రైతుల పట్ల తెరాస ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు.

చంద్రబాబుతో మంత్రి గంటా భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం ఉదయం సమావేశమయ్యారు. ఇరు రాష్ర్టాల విద్యాశాఖమంత్రుల భేటీ వివరాలను ఈ సందర్భంగా చంద్రబాబుకు మంత్రి గంటా వివరించనున్నట్లు తెలుస్తోంది. తదుపరి కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

తుపాను బాధితులను ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు వచ్చిన సినీ ప్రముఖులు మంగళవారం చంద్రబాబుతో సమావేశమయ్యారు. తుపాను బాధితులకు ప్రకటించిన విరాళాల చెక్కును బాబుకు అందజేశారు. చంద్రబాబును కలిసిన వారిలో రాఘవేంద్రరావు, బ్రహ్మానందం, కాట్రగడ్డ ప్రసాద్‌, అశోక్ కుమార్‌ ఉన్నారు.

జగన్‌కు ఎమ్మెల్యేలు షాకిస్తారా?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి కొణతాల రామకృష్ణ షాకిచ్చిన విషయం తెలిసిందే. ఆయన మాత్రమే కాకుండా.. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, కీలక పార్టీ నేతలు వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరు ఓ జాతీయ పార్టీలో చేరనున్నారని ప్రచారం సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+