రేవంత్ రెడ్డి దగ్గర ఏ గిఫ్ట్ తీసుకున్నారు? : ఏపీ సీఎంపై గోరంట్ల మాధవ్ ఫైర్
రేవంత్ రెడ్డి దగ్గర ఏ గిఫ్టు తీసుకుని రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ స్కీమ్‌ను చంద్రబాబు పక్కనపెట్టారో ప్రజలకు స్పష్టం చేయాలని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రగతిని తాకట్టుపెట్టడం అలవాటుగా మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నారని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీనే చెప్పారన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి.. పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నా హక్కులు వదిలేసుకుని చంద్రబాబు విజయవాడకు పారిపోయి వచ్చారని తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు ఆ కేసు నుంచి బయటపడటం కోసం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో కుమ్మక్కై రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశారని ఆరోపించారు.

చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ లిఫ్టును తానే ఆపేయించానని తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. దానిపై నిజనిర్ధారణకు కూడా సిద్ధమని ప్రకటించడం చూస్తే ఎన్నో అనుమానాలకు తావిస్తోందని అనుమాన పడ్డారు. ఏపీ ప్రయోజనాలను కూడా తాకట్టు పెట్టేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చేసుకున్న ఆ రహస్య ఒప్పందం ఏమిటో చంద్రబాబు ఏపీ ప్రజల ముందు బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. వైయస్ జగన్ కి మంచి పేరు రావడం ఓర్వలేకనే చంద్రబాబు రాయలసీమ లిఫ్టును పణంగా పెట్టడానికి కూడా వెనుకాడటం లేదని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆరోపించారు.
రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నించినందుకే తనపై అక్రమంగా కేసు నమోదు చేసి, వారెంట్ జారీ చేశారని పేర్కొన్నారు. చిన్నారిని చంపేసి ఏడాదిన్నర గడిచినా ఇంతవరకు మృతదేహాన్ని గుర్తించి నిందితులను శిక్షించలేని కూటమి ప్రభుత్వం.. అన్యాయాలను ప్రశ్నిస్తున్న వైయస్సార్సీపీ నాయకులపై మాత్రం అక్రమ కేసులు పెట్టి ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయాలపై పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని గోరంట్ల మాధవ్ సూచించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications