ఘరానా ఎర్రచనందనం స్మగ్లర్ అరెస్టు: శేషాచలం అడవుల్లో కాల్పులు
కడప/ తిరుపతి: బెంగుళూరుకు చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ఫయాజ్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాకు చెందిన ప్రత్యేక పోలీసులు అరెస్టు చేసి మంగళవారం ఉదయం మీడియా ముందు హాజరుపరిచారు.
ఫయాజ్ నుండి రెండు కోట్ల విలువచేసే 4 టన్నుల ఎర్రచందనం దుంగలు, ఐదు కార్లు, మూడు వ్యాన్లు, కొంత నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై వివిధ ప్రాంతాల్లో 61 కేసులు విచారణలో ఉన్నాయి.
ఇదిలావుంటే, చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని శేషాచల అడవుల్లో కూంబింగ్ చేస్తున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులపై ఎర్రచందనం కూలీలు రాళ్ళ దాడికి దిగిన సంఘటన సోమవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరపడంతో కూలీలు అక్కడ నుంచి పరారయ్యారు.

ఈ సందర్భంగా కూలీలు అక్రమంగా తరలించడానికి సిద్ధం చేసిన ఒకటిన్నర కోటి రూపాయల విలువ చేసే 50 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రాత్రి కూంబింగ్ చేస్తున్న టాస్క్ఫోర్సు పోలీసులకు సుమారు 50మంది పోలీసులు తారసపడ్డారు.
వెంటనే కూంబింగ్ చేస్తున్న ఏడుగురు టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై రాళ్లు రువ్వారని, దీంతో గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు చెప్పారు. పరారైన కూలీల కోసం అదనపు బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications