వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాతీయ ఆరోగ్య సర్వే; ఏపీలో బాగా తగ్గిన సంతానోత్పత్తి రేటు; రీజన్ ఇదే!!

|
Google Oneindia TeluguNews

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) యొక్క తాజా సర్వే ఆసక్తికర విషయాలను వెల్లడించింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా పడిపోయింది. ఏపీలోని కుటుంబాల్లో పిల్లల సంఖ్య నానాటికీ తగ్గిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ పాటిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

గతంలో ఇద్దరు పిల్లలు లేదా ముగ్గురు పిల్లలు ఉండాలని భావించేవారు. ఆపై ఒకరు లేదా ఇద్దరు పిల్లలు చాలు అన్న భావనకు వచ్చారు. ఇక ప్రస్తుతం చాలామంది పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో ఒక్కరు ఉంటే చాలు అన్న అభిప్రాయానికి వచ్చారు. దీంతో సంతానోత్పత్తి రేటు గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగటున ప్రతి 10కుటుంబాలకు 17మంది పిల్లలు ఉన్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.

 Reduced fertility rate in Andhra pradesh; said national family health survey

తాజా సర్వే ప్రకారం ఏపీలో సంతానోత్పత్తి రేటు 1.7గా నమోదైంది. 2015 2016 సంవత్సరం లో ఏపీలో 2.2 సంతానోత్పత్తి రేటు ఉండేది. అది క్రమంగా తగ్గుతూ వచ్చింది. కుటుంబ నియంత్రణ పట్ల ప్రజల్లో అవగాహన పెరగడం, పేద కుటుంబాల్లో పిల్లల పోషణ భారం కూడా సంతానోత్పత్తి రేటు తగ్గడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా తాజా సర్వే ప్రకారం సంతానోత్పత్తి రేటు 2.2 నుండి 2.0కి తగ్గింది. దేశ వ్యాప్తంగా కేవలం ఐదు రాష్ట్రాల్లో మాత్రమే రెండు శాతం కంటే ఎక్కువగా సంతానోత్పత్తి రేటు నమోదైంది. అత్యధికంగా బీహార్ రాష్ట్రంలో 2.98, ఆ తర్వాత స్థానంలో మేఘాలయ 2.91, ఉత్తరప్రదేశ్ 2.35, జార్ఖండ్ 2.26, మణిపూర్ 2.17 శాతంతో సంతానోత్పత్తి రేటు లో టాప్ ఫైవ్ లో ఉన్నాయి. మిగతా రాష్ట్రాలు అన్నీ రెండు శాతం కంటే తక్కువగా సంతానోత్పత్తి రేటు నమోదు చేశాయి. ఈ సర్వేలో దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 707 జిల్లాల నుంచి దాదాపు 6.37 లక్షల నమూనాలను సేకరించి సర్వే నిర్వహించారు.

English summary
The fertility rate in AP was 1.7 in a survey conducted as part of the National Family Health Survey. On an average, there are 17 children in every 10 families.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X