ఏపీకి వెళ్లండి.. తెలంగాణలోని ఐపీఎస్‌లకు కేంద్రం షాక్
తెలంగాణలో కొనసాగుతున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోంశాఖ షాకిచ్చింది. తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతిలను రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఈ ముగ్గురు అధికారులు వెంటనే ఏపీలో రిపోర్టు చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.
అంతేగాక, 24 గంటల్లోనే ఏపీలో రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది. కాగా, రాష్ట్ర విభజన సందర్భంగా ఈ అధికారులను ఏపీకి కేటాయించారు. అయితే, ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన వారు తెలంగాణలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం డీజీ ర్యాంకులో కొనసాగుతున్న అంజనీకుమార్.. రోడ్ సేఫ్టీ డీజీగా ఉన్నారు.

డీజీ ర్యాంకులో ఉన్న మరో ఐపీఎస్ అధికారి అభిలాష బిస్త్.. పోలీస్ ట్రైనింగ్ డీజీగా ఉన్నారు. ఎస్పీ ర్యాంకులో కొనసాగుతున్న అభిషేక్ మహంతి.. ప్రస్తుతానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే అంజనీకుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతిలను వెంటనే రిలీవ్ చేయాలని తెలంగాణ సర్కారును ఆదేశించిన కేంద్ర హోంశాఖ.. వెంటనే ఏపీ క్యాడర్‌లో రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది. గతంలో కూడా పలువురు ఐఏఎస్ అధికారులు తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన విషయం తెలిసిందే.
ఇదీ చదవడి: చంద్రబాబుతో పంచాయితీ ఉండేదా?












Click it and Unblock the Notifications