టి ఎందుకు: పవన్-జెపిలపై రేవంత్, కెసిఆర్‌కు సవాల్
హైదరాబాద్: హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి లోకసభ స్థానం తెలుగుదేశం పార్టీలో హాట్‌గా మారింది. మల్కాజ్‌గిరినుంచి లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ పోటీ చేస్తే స్థానికులతోపాటు తానూ వ్యతిరేకిస్తానని టిడిపి సీనియర్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో శనివారం భేటీ అయిన అనంతరం రేవంత్ విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
తాను మల్కాజ్‌గిరి పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేస్తానని చెప్పారు. తెలంగాణ ప్రాంతమైన మల్కాజ్‌గిరిలో సీమాంద్రులు, స్థానికేతరులు పోటీ చేయాలనుకోవడం సరికాదని విమర్శించారు. కష్టపడి తెలంగాణ సాధించుకుంది దేని కోసమని ప్రశ్నించారు. స్థానికులకు అవకాశాల కోసమే తెలంగాణను సాధించుకున్నామని రేవంత్ వ్యాఖ్యానించారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి స్థానికేతరులను ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయనీయబోమన్నారు.

టిడిపిని విమర్శిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాలమూరు నుంచి తిరిగి పోటీ చేసి గెలుపుతో చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని రేవంత్ సవాలు చేశారు. పొత్తులో భాగంగా జయప్రకాశ్ నారాయణ మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం విస్తృతంగా సాగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అదే సమయంలో పవన్ కళ్యాణ్ పేరు కూడా తెర పైకి వచ్చింది.
దీంతో మల్కాజిగిరి లోకసభ స్థానంపై తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి కిరికికి ప్రారంభించారు. ఆ స్థానం నుంచి తానే పోటీ చేస్తానని ఆయన శనివారం ప్రకటించారు. స్థానికేతరులు ఎలా పోటీ చేస్తారని, అలాంటప్పుడు ఇక తెలంగాణ సాధించుకున్నది ఎందుకని ప్రశ్నించారు.
తెలుగుదేశం, బిజెపి, జనసేనల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉంది. దీంతో జయప్రకాష్ నారాయణ ఆ సీటునుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆ విషయాన్ని జెపి బహిరంగంగానే చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా ఆ సీటు నుంచి పోటీ చేసి తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. పొత్తు కారణంగా ఆ సీటు వారిద్దరికీ దక్కకుండా రేవంత్ రెడ్డి ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications