Exit polls:టీడీపీని నిండా ముంచేసిన ఆ సర్వేలు..?

ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. శనివారం సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని అధికారంలోకి వస్తుందో అని స్థానిక సర్వేలతో పాటు, జాతీయ సర్వే సంస్థలు కూడా తమ నివేదికలను విడుదల చేశాయి. విచిత్రంగా నేషనల్ సర్వేలు కూడా టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని చెప్పగా, స్థానిక సర్వేలు మాత్రం వైసీపీ విజయం సాధిస్తుందని ప్రకటించాయి.

అయితే నేషనల్ సంస్థలు చేసిన సర్వేలపై ఇప్పుడు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే నేషనల్ సర్వేలన్నీ కూడా ఎన్డీఏ కూటమికి పట్టం కట్టాయి. ఈక్రమంలోనే ఏపీలో కూడా టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని లెక్కలు వేసుకుని తమ నివేదికను ఇచ్చినట్టు స్పష్టం అవుతోంది.ఎందుకంటే నేషనల్ సర్వేలు ఎప్పుడు కూడా నేరుగా ప్రజల దగ్గర నుంచి శాంపిల్స్ తీసుకోవు. ఇక్కడ ఎవరో ఒకరికి కాంట్రాక్ట్ ఇచ్చేస్తుంటారు. అయితే ఆ కాంట్రాక్ట్ తీసుకుంది ఎవరు..వారు ఎంతమంది దగ్గర నుంచి శాంపిల్స్ తీసుకున్నారనే విషయాన్ని బయటపెట్టరు. దీంతో జాతీయ స్థాయిలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో రాష్ట్రంలో కూడా అదే పార్టీ లేదా వారి కూటమి అధిక స్థానాలను గెలుచుకుంటుందని ప్రకటిస్తుంటాయి. శనివారం విడుదల చేసిన సర్వేల్లో ఇదే స్పష్టం అయింది.

review of national surveys and local surveys

ప్రాంతీయ పార్టీల్లో జాతీయ సర్వేల లెక్కలు తక్కువ స్థాయిలో మాత్రమే నిజం అయ్యాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని మెజార్టీ సర్వేలు ప్రకటించినా..అంతటి భారీ స్థాయిలో విజయం దక్కుతుందని స్థానిక సర్వేలు మాత్రమే పసిగట్టాయి. దీంతో జాతీయ సర్వే ఫలితాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జాతీయ సంస్థలు ప్రీ పోలింగ్ సర్వేలు చేస్తాయి. కానీ స్థానిక సంస్థలు పోలింగ్ తర్వాత ప్రజల నాడి ఎలా ఉందనే దానిపై విశ్లేషించుకుని తమ సర్వే నివేదికను ప్రకటిస్తాయి. అందుకే ఆత్మ సాక్షి, ఆపరేషన్ చాణక్య,ఆరా సంస్థ వంటి స్థానిక సర్వే సంస్థలు అంతలా విశ్వసనీయతను సాధించాయి.

ఇక్కడ జాతీయ సర్వేలను తప్పు పట్టాల్సిన పనిలేదు. వారు కొంత పరిధి వరకు మాత్రమే పని చేయగలుగుతారు. అదే స్థానిక సర్వేలకు ఎటువంటి నియమాలు ఉండవు. దీంతో జాతీయ సర్వేలు వర్సెస్ లోకల్ సర్వేలు అంటూ సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేసుకుంటున్నాయి. ఏది ఏమైనప్పటికి నేషనల్ సర్వేలు తమ నివేదికలను నాసిరకంగానే ఇచ్చాయనే అభిప్రాయం అధికంగా వ్యక్తం అవుతోంది. జాతీయ సర్వేలను నమ్ముకునే కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు పెట్టినట్టు తెలుస్తోంది. జాతీయ సర్వేలు నిజం అయితే ఫర్వాలేదు కానీ.. ఫెయిల్ అయితే మాత్రం కూటమి నేతలు నిండా మునిగిపోయినట్టే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి ఎవరి సర్వేలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయో మరో 48 గంటల్లో తేలిపోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+