వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్యాన్స్‌లా, మీ నాన్నకి చెప్పు:రిషికేశ్వరి కేసులో ప్రిన్సిపల్‌పై జడ్జి, రోజా ఆగ్రహం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రిషికేశ్వరి ఆత్మహత్యకు ప్రధాన కారకుడిగా చెబుతున్న ప్రిన్సిపల్ బాబురావు పైన గుంటూరు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలతో ప్రిన్సిపల్ డ్యాన్సులు చేయడం విడ్డూరమని, సిగ్గుమాలిన చర్య అన్నారు.

రిషికేశ్వరి ఆత్మహత్య కేసులో జిల్లా లీగల్ సెల్ అథారిటీ విచారణ జరిపింది. ప్రిన్సిపల్ బాబురావు, హాస్టల్ వార్డెన్ స్వరూపారాణిలు అథారిటి ముందు శుక్రవారం నాడు హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంత జరిగినా కనీసం బాబురావులో పశ్చాత్తాపం కనిపించడం లేదని, మీ నాన్నకు నీవైనా చెప్పాలని ప్రిన్సిపల్ కొడుకును ఉద్దేశించి జడ్జి చెప్పారు. రిషికేశ్వరి ఆత్మహత్య పైన వీసీ ఫిర్యాదు చేయడంతో... సుమోటోగా స్వీకరించిన కేసును లీగల్ సెల్ అథారిటీ కొట్టివేసింది.

రిషికేశ్వరి

రిషికేశ్వరి

రిషికేశ్వరి ఆత్మహత్య కేసులో ఏపీ విద్యార్థి జెఏసీ శుక్రవారం నాడు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. ప్రిన్సిపల్ పైన చర్యలు తీసుకోవాలని కోరింది.

వైసీపీ

వైసీపీ

రిషికేశ్వరి ఆత్మహత్య ఘటనపై అనేక అనుమానాలు తలెత్తుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ధనం, స్థలంతో కేసును నీరుగార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సెటిల్‌మెంట్‌లకు పాల్పడుతున్నారని వైసీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యురాలు రోజా గురువారం ఆరోపించారు.

వైసీపీ

వైసీపీ

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్‌కు గురువారం 20 మంది సభ్యులు గల వైసిపి నిజ నిర్ధారణ కమిటీ విచ్చేసింది. ఈ సందర్భంగా శాసనసభ్యురాలు రోజా మాట్లాడారు. చంద్రబాబు ముసునూరు తహశీల్దార్ వనజాక్షి ఘటనలో సెటిల్‌మెంట్ చేసిన విషయాన్ని ప్రజలు గుర్తించారన్నారు.

వైసీపీ

వైసీపీ

ప్రస్తుతం రిషితేశ్వరి ఆత్మహత్యను నీరు గార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, విద్యార్థి సంఘాలు వెల్లడించిన అంశాలతో అర్థమవుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళల పట్ల వివక్షత చూపించి వారి మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు.

వైసీపీ

వైసీపీ

విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఘటన జరిగిన తర్వాత క్యాంపస్‌కు చుట్టపుచూపుగా వచ్చి వెళ్లడం సమంజసంగా లేదన్నారు. మంత్రి సినిమా ఫంక్షన్లతో బిజీ బిజీగా గడపడం సిగ్గుచేటన్నారు. మంత్రి పీతల సుజాత మహిళలైన వనజాక్షి, రిషికేశ్వరిలకు న్యాయం చేయకుండా వైసీపీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య వెనుక గల రహస్యాలను ఛేదించాల్సిన అవసరం ఉందన్నారు.

English summary
Trial starts in Rishikeshwari suicide case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X