Lalu Prasad: శ్రీవారి సేవలో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం..
ఆర్జేడీ అధినేత, మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రిదేవి శనివారం తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శుక్రవారం రాత్రి తిరుమలకు కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్న ఆయన శనివారం తెల్లవారుజామున స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. పూజల అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు.
లాలు ప్రసాద్ యాదవ్ దంపతుల వెంట కుమారుడు తేజస్వి యాదవ్, కుటుంబ సభ్యులు ఉన్నారు. కాగా లాలు ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణంలో శిక్ష అనుభవించారు. కాగా తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు కంపార్ట్‌మెంట్లలో కాకుండా నేరుగా దర్శనం కోసం క్యూలైన్లో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. నిన్న స్వామివారిని 54, 523 మంది భక్తులు దర్శించుకోగా 20,817 మంది తలనీలాలు సమర్పించుకున్నట్లు చెప్పారు.













Click it and Unblock the Notifications