జగన్ పల్నాడు పర్యటన వేళ.. రోజా కీలక వ్యాఖ్యలు

Roja: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై.. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్ కే రోజా విమర్శలు గుప్పించారు. తల్లికి వందనం పథకం పేరుతో మోసం చేస్తోందంటూ ఆరోపించారు.

వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్వహించ తలపెట్టిన పల్నాడు జిల్లా పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించ‌డం రోజా స్పందించారు. ప్రభుత్వం, పోలీసుల వైఖరిని తప్పుపట్టారు. ఆంక్షలు విధించడాన్ని ఆమె తప్పు పట్టారు. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.

Roja criticized Andhra Govt over restrictions imposed on YS Jagan s Palnadu visit

ముఖ్యమంత్రిగా పని చేసిన నాయకుడిని జిల్లా పర్యటనకు వెళ్లనివ్వకుండా అడ్డుకోవడం ఏ మాత్రం సహేతుకం కాదని రోజా అన్నారు. పోలీసులు, ప్రభుత్వం, అధికార యంత్రాంగం.. ఆంక్ష‌లు పెట్టి అత్యంత ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన ఓ నాయ‌కుడిని అడ్డుకోవ‌డం క‌రెక్ట్ కాదని పేర్కొన్నారు. దీనిపై తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు.

చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్ర‌భుత్వ వేధింపులు భ‌రించ‌లేక‌ వైఎస్ఆర్సీపీకి చెందిన కార్య‌క‌ర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడని, ఆయ‌న కుటుంబాన్ని వైఎస్ జ‌గ‌న్ ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్ల‌డం త‌ప్పా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ కార్య‌కర్త‌లు మరణించిన‌ప్పుడు చంద్రబాబు వెళ్లి ఆ కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించ‌లేదా?..అని గుర్తు చేశారు.

పోలీసులు, అధికారులతో ఆంక్ష‌లు పెట్టి ఓ ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన నాయ‌కుడిని అడ్డుకోవాల‌ని చూడ‌డం ఏ మాత్రం క‌రెక్టు కాదు చంద్ర‌బాబు గారూ..అంటూ రోజా ట్వీట్ చేశారు. వైఎస్‌ జగన్‌ పర్యటనకు వంద మంది మాత్రమే రావాలంటూ పోలీసులు ఆంక్షలు పెట్టారని రోజా గుర్తు చేశారు. మూడు వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తామని ఎస్పీ ఓ ప్రకటనలో తెలిపారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+