వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుద్ధం చేస్తాం: రోజా, ఎమ్మెల్యేలతో జగన్ బ్రేక్‌ఫాస్ట్ భేటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తాము ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన అసెంబ్లీలో యుద్ధం చేస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నగరి నుండి కాంగ్రెస్, టిడిపి నుండి మహామహులు తనతో పోటీకి దిగినా తానే గెలిచానని అభిప్రాయపడ్డారు. అలాగే ప్రజల పక్షాన అసెంబ్లీలో ప్రభుత్వంపై పోరాడుతామన్నారు.

ఎమ్మెల్యేలతో జగన్ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో గురువారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఉదయం తొమ్మిది గంటలకు ఆయన లోటస్ పాండులో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.

Roja says they will fight for people

ఈ సందర్భంగా అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం పైన చర్చించారు. ఉదయం పది గంటలకు పంజాగుట్ట సర్కిల్‌లోని వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తారు.

అనంతరం అసెంబ్లీ సమావేశాలకు పార్టీ ఎమ్మెల్యేలు బయలుదేరుతారు. ఉదయం పదకొండు గంటలకు అసెంబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు నివాళులు అర్పిస్తారు. లోటస్ పాండు నుండి అసెంబ్లీకి బస్సులో వస్తున్నారు.

English summary
YSR Congress Party leader Roja said they will fight for people in Andhra Pradesh Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X