అనుమానం ఉంది: రోజా ధర్నా, వైసీపీ కార్యకర్త హత్య

చిత్తూరు: చిత్తూరు జిల్లా తిరుపతిలో పదో తరగతి విద్యార్థి మోహన్ కృష్ణా రెడ్డి అనుమానాస్పద మృతి పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గురువారం ధర్నా చేపట్టింది. మోహన్ కృష్ణా రెడ్డి మృతి పైన చాలా అనుమానాలు ఉన్నాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. తక్షణమే న్యాయ విచారమ జరిపించాలన్నారు. మంత్రి నారాయణ పైన చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు.

పరంధామ రెడ్డి, లక్ష్మీ దంపతుల కుమారుడు మోహన్ కృష్ణా రెడ్డి ఓ కార్పోరేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. గత గురువారం పాఠశాల యాజమాన్యం ఆ బాలుని తల్లిదండ్రులకు ఫోన్ చేసి ప్రమాదవశాత్తు అద్దంపై పడటంతో గాయపడ్డాడని ఆసుపత్రిలో చేర్పించింది. మోహన కృష్ణరెడ్డి మృతి చెందాడు. దీనిపై విచారణ జరిపించాలని రోజా డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో చెవిరెడ్డి భాస్కర రెడ్డి కూడా పాల్గొన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్త దారుణ హత్య

Roja stage dharna in Tirupati

గుంటూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్త హత్యకు గురయ్యారు. జిల్లాలోని కారంపూడి మండలం చిన్నగార్లపాడులోని కార్యకర్త గోవింద రెడ్డి పైన ప్రత్యక్థులు దాడి చేశారు. దీంతో అతను మృతి చెందాడు.

ఆర్టీసీ బస్సును ఢీకొన్న 108 ఆంబులెన్స్‌ : ఇద్దరి మృతి

తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం సమీపంలోని పుట్టగొడుగుల ఫ్యాక్టరీ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆర్టీసీ బస్సును 108 ఆంబులెన్స్‌ ఢీకొనడంతో అంబులెన్స్‌ డ్రైవర్‌, రోగి మృతి చెందాడు. మర్రిపూడి నుంచి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+