ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సినీ దర్శకుడిగా రౌడీషీటర్ ఫోజులు: నవవధువు ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సినీ నిర్మాతగా, దర్శకుడిగా చెలామణీ అవుతున్న ఓ రౌడీ షీటర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన రౌడీషీటర్‌ను గురువారం హైదరాబాద్ నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్సుపోలీసులు అరెస్ట్‌ చేశారు.

అతడి నుంచి రెండు పిస్టళ్లు, 16 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. సినిమా నిర్మాతగా, దర్శకుడిగా చెప్పుకుంటూ అతడు హైదరాబాద్ నగరంలో తిరుగుతున్నట్టు పోలీసులు తెలిపారు.

హత్య అంటూ ఆరోపణలు

ఓ నవ వధువు కాళ్ల పారాణి ఆరకముందే ఆత్మహత్యకు పాల్పడింది. విషాదకరమైన ఈ సంఘటన హైదరాబాదులోని వెంకటగిరిలో జరిగింది. జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటగిరిలో కొత్తగా పెళ్ళయిన నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, బంధువులు మాత్రం ఆమెది హత్యేనని ఆరోపిస్తున్నారు. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు.

Rowdy sheet arrested acting as cine director

డబ్బు అడిగినందుకు నిర్బంధం

చిట్టీల రూపంలో దాచుకున్న డబ్బును అడిగినందుకు మహిళను బాత్‌రూంలో నిర్బంధించాడు ఓ వ్యక్తి.బంధించడమే కాదు దుర్భాషలాడి, అనుచితంగా ప్రవర్తించి అవమానించాడు. బెదిరించాడు. చివరికి నిర్భయ చట్టం కింద ఊచలు లెక్కిస్తున్నాడు.

హైదరాబాదులోని జూబ్లిహిల్స్‌ పరిధిలో గల యాదగిరినగర్‌కు చెందిన మహాలక్ష్మి అనే గృహిణి.. అదే బస్తీకి చెందిన నర్సింహ అనే వ్యక్తి వద్ద చిట్టీలు కడుతూ పొదుపు చేయసాగింది. రూ.3.5 లక్షలు కట్టిన అనంతరం డబ్బు ఇవ్వాల్సిందిగా నర్సింహను అడిగింది. ఆమెకు డబ్బు కట్టకపోగా రివర్సులో ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు అతడు.

ఈ క్రమంలోనే బుధవారం నర్సింహ ఇంటికి వెళ్లింది మహాలక్ష్మి డబ్బు అడిగింది. ఇద్దరి మధ్యా మాటామాట పెరగడంతో.. నర్సింహ ఆమె పట్ల అనుచితంగా వ్యవహరించాడు. అంతే కాకుండా కుమారుడు, భార్య, మేనల్లుడితో కలిసి ఆమెను బాత్‌రూంలో గంట పాటు నిర్బంధించాడు. అనంతరం దాడికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు జూబ్సిహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

అంతేగాకుండా పోలీసుల విచారణలో నర్సింహ చిట్టీల పేరుతో చాలామందికి రూ.3 కోట్ల మేర టోపీ పెట్టినట్లు తేలింది. బాధితుల ఫిర్యాదుతో అతడిపై మరో కేసు పెడతామని పోలీసులు తెలిపారు.

English summary
Hyderabad north zone police arrested a rowdy sheet belongs to Eluru in West Godavari district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X