నారాయణ కాలేజీకి షాక్: భారీ జరిమానా విధింపు

Subscribe to Oneindia Telugu

కడప: విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో కడపలోని నారాయణ కళాశాలకు రూ.10లక్షల జరిమానా విధించినట్లు ఆర్ఐఓ రవి తెలిపారు. బుధవారం ఆయన రాయచోటిలో పలు కళాశాలలను తనిఖీ చేశారు.

విషాదం: నారాయణలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కడపలోని నారాయణ కళాశాలలో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సమగ్ర విచారణ జరిపామని తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్య విషయంలో కళాశాల యాజమాన్యం, సిబ్బంది తప్పు ఉన్నందున ఉన్నందున జరిమానా విధించినట్లు చెప్పారు.

Rs 10 lakhs fine for kadapa narayana college.

ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు విద్యార్థులపై ఒత్తిడి పెంచితే చర్యలు తప్పవని ఆర్ఓ రవి స్పష్టం చేశారు. గత నెలలో కడపలోని నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న పావని(16) హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rs 10 lakhs fine for kadapa narayana college.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి