మాస్క్ లేకుంటే వెయ్యి వాత.. ఏపీలో కొత్త మార్గదర్శకాలు.. ఇవే రూల్స్
దేశంలో కరోనా కొత్త కేసులు రికార్డు స్థాయిలో వస్తున్నాగాయి. ఏపీలో కూడా కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. రోజు 300కు పైగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. తాజాగా 500కు చేరువలో అంటే 492 మంది కోవిడ్ బారిన పడటం ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా సెకండ్ వేడ్ విజృంభిస్తుందనే భయం సర్వత్రా నెలకొంది. వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. నో మాస్క్.. నో ఎంట్రీ విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.

నెల్లూరులో అమలు
నెల్లూరు జిల్లా కలెక్టర్ అడుగు ముందుకేసి కీలక నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశాల మేరకు నగరంలో కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. నగరంలో గల పబ్లిక్ ప్రదేశాల్లో మాస్కులు లేకుండా ఎవరు తిరిగితే ఉపేక్షించేది లేదన్నారు. మాస్కులు ధరించకుండా తిరిగే వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

విద్యార్థులకు వైరస్
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరులోని ఓ జూనియర్ కాలేజీలో ఏకంగా 140 మంది విద్యార్థులకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఇక్కడ వేలల్లో విద్యార్థులు ఇంటర్ చదువుతున్నారు. వీరిలో వందలాది మంది వసతిగృహాల్లో ఉంటున్నారు. వీరికి టెస్ట్‌లు నిర్వహించగా.. సోమవారం ఒక్కరోజే 140 మందికి వైరస్ సోకినట్టు తేలింది. అప్రమత్తమైన అధికారులు బాధితులను వసతి గృహాల్లో గల ఐసోలేషన్‌లో ఉంచారు. ఇక్కడ పాజిటివ్‌ల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతాన్ని కంటైన్ మెంట్ జోన్‌గా ప్రకటించారు.
Recommended Video

వైరస్ వ్యాప్తి
రామచంద్రపురంలో ఎనిమిది మందికి, ముమ్మిడివరం బాలికోన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ముగ్గురు బాలికలకు పాజిటివ్‌గా తేలింది. రావులపాలెం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఎనిమిది విద్యార్థికి కొవిడ్ సోకింది. నెల్లూరులోని బాలాజీనగర్ పోలీసుస్టేషన్‌లో పది మంది సిబ్బందికి కరోనా సోకింది. స్టేషన్‌లో సిబ్బంది పలు ప్రాంతాల్లో బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. పలువురు సిబ్బందికి జ్వరం, తీవ్ర తలనొప్పి రావడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా 10 మందికి కరోనా సోకినట్లు తెలిసింది. దీంతో మిగిలిన వారు కూడా నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications