కంచె చేను మెసింది.. రూ.47 లక్షలు మాయం, సిబ్బంది చేతివాటంతో..?
కంచె చేను మెసింది. అవును ఏటీఎంలలో డబ్బులు పెట్టే సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.47 లక్షలను కాజేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దొంగలను పట్టుకునే పనిలో ఉన్నారు. అయితే ఓకేసారి 9 ఏటీఎంల నుంచి నగదు మాయమవడంతో.. సిబ్బంది హస్తం లేకుండా నగదు బయటకు వెళ్లదని భావిస్తున్నారు. నగదు మాయమైన అంశానికి సంబంధించి పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నారు. ఎంక్వైరీలో నిజ నిజాలు తెలుస్తాయని పోలీసు అధికారులు చెబుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఏటీఎంలలో డబ్బులు మాయం అయ్యాయి. వివిధ బ్యాంకులకు చెందిన 9 ఏటీఎలం నుంచి నగదు మాయమైంది. ఒకటి కాదు రెండు కాదు రూ. 47 లక్షలు కనిపించడం లేదు. అయితే ఏటీఎంలలో డబ్బులు పెట్టే రైటర్ కంపెనీ ఉద్యోగులు చోరీ చేశారని వారు అనుమానిస్తున్నారు. మిగతా వారు చోరీ చేసేందుకు తక్కువ అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సిబ్బందిని ప్రశ్నించడంతో నిజ నిజాలు తెలుస్తాయని తెలిపారు. వీరికి ఎవరూ సహకరించి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏటీఎం నుంచి పెద్ద ఎత్తున డబ్బు మాయం కావడం కలకలం రేపింది. అయితే 9 ఏటీఎంల నుంచి నగదు ఎలా మాయమైంది. వారు డబ్బును జమచేశారా లేదా..? చేయకుండానే వెళ్లిపోయారా..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. డబ్బులు డిపాజిట్ చేసి కూడా వెంటనే తీసే వెసులుబాటు ఉంటుందని చాలా సందర్భాల్లో తేలింది. అయితే వీరు కూడా అలానే చేసి ఉంటారా అనే ప్రశ్న వస్తోంది. ఏదీ ఏమైనప్పటికీ రూ.47 లక్షల పెద్ద మొత్తం దోచుకెళ్లి పోవడం సంచలనం రేపింది.












Click it and Unblock the Notifications