జగన్ కోసం మాజీ ఐపీఎస్ ను రంగంలోకి దింపిన కేసీఆర్?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై, ఊహించని విధంగా వైఎస్ జగన్ పై, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లపై కేసులు నమోదు కావటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక తాజా పరిణామాలపై బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.

ఆ వార్తతో షాకయ్యా
గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజును వేధించారు అన్న ఆరోపణలతో వైయస్ జగన్ తో పాటు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు పీవీ సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పు పట్టారు. ఈ వార్త తనను షాక్ కు గురిచేసింది అంటూ సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

RS Praveen kumar shocking comments on ap politics KCR fielded former IPS for YS Jagan

ప్రతీకార రాజకీయం
మూడేళ్లు క్రితం జరిగిన ఈ ఘటనపై ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కేవలం ప్రతీకార రాజకీయం లాగా కనిపిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మూడేళ్లలో అధికారం మారడం తప్ప ఏమీ మారలేదని, అప్పట్లోనే ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరిపితే ఏమీ బయటకు రాలేదన్నారు. నిజాయితీ గల పోలీసులు ఈ దేశంలో ప్రతీకార రాజకీయాలలో బాధితులుగా మారుతున్నారంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో రాజకీయాలకు బలవుతున్న అధికారులపై ఆర్ఎస్ ప్రవీణ్
గోద్ర మారణ హోమంలో సత్యం, న్యాయానికి అండగా నిలిచిన కారణంగా గుజరాత్ కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ ఏళ్ల తరబడి జైల్లో మగ్గుతున్నారని పేర్కొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలలో సీనియర్ పోలీస్ అధికారులపై నమోదు చేసిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు.

రఘురామను టార్గెట్ చేసిన మాజీ ఐపీఎస్
రాజకీయ నాయకుల కక్షసాధింపు చర్యలకు అధికారులు బలవుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రఘురామ కృష్ణంరాజును కూడా టార్గెట్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 2021 లో పార్లమెంట్లో తనపై సదరు రాజకీయ నాయకుడు నిరాధారమైన ఆరోపణలు చేశారని, మళ్లీ ఆయన ఎమ్మెల్యే ఎలా అయ్యారంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

ఆర్ఎస్ వ్యాఖ్యల వెనుక కేసీఆర్
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలన్నారు.అయితే ఏపీ ఐపీఎస్ ఆఫీసర్లతో పాటు జగన్ పై పెట్టిన కేసులపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కేసీఆర్ రంగంలోకి దించారని, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యల వెనుక కేసీఆర్ ఉన్నారని ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+