ఆర్టీసీ బస్సు బీభత్సం: బీటెక్ విద్యార్ధి మృతి
విజయవాడ: కృష్ణాజిల్లా విజయవాడ సమీపంలోని గంగూరు వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వాహనాలు, జనాలపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఓ ఇంజనీరింగ్ విద్యార్ధి మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఆర్టీసీ బస్సు మచిలీపట్నం నుంచి విజయవాడ వస్తుండగా పెనమలూరు మండలం గంగూరు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు స్టీరింగ్ ఫెయిల్ అవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో చనిపోయిన బీటెక్ విద్యార్ధి రూపా స్టీపెన్ (20) పరిటాలలోని ఎమ్‌వీఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం గంగూరుకు చెందిన స్టీపెన్ బైకుపై కాలేజికి వెళ్తుండగా గంగూరు వద్ద బస్సు ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications