Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉచిత బస్సు ప్రయాణం వేళ ఆర్టీసీ సరికొత్త ప్రయోగం.. ఆ బస్సుల్లో ఏసీలో ప్రయాణం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని అమలు చేస్తున్న క్రమంలో అదనపు బస్సుల అవసరం పెరిగింది. స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్న ఏపీ సర్కార్ ఏపీలో రోడ్డు రవాణా వ్యవస్థను పటిష్టం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఇదే సమయంలో పర్యావరణానికి హాని కలుగకుండా ఉండేవిధంగా ఈ బస్సులను పెద్ద సంఖ్యలో ఏపీలో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.

డీజిల్ సూపర్ లగ్జరీ బస్సులను ఎలక్ట్రిక్ ఏసీ బస్సులుగా
దీనికోసం ఏపీలో పాత డీజిల్ సూపర్ లగ్జరీ బస్సులను ఎలక్ట్రిక్ ఏసీ బస్సులుగా మార్చడానికి అధికారులు వినూత్న ప్రయోగాన్ని చేపట్టారు. చిత్తూరు జిల్లాలో ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఇది సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల డీజిల్ బస్సులను ఏసీ సూపర్ లగ్జరీ ఈ బస్సులు గా మార్చే ఆలోచనలో ఉన్నారు.

RTC Super News Comfortable cool pollution-free travel with electric ac buses

బస్సులను పర్యావరణ హితంగా, ఆర్టీసీకి లాభదాయకంగా మార్చే ప్లాన్
పాత డీజిల్ బస్సులను, పర్యావరణ హితంగా, ఆర్టీసీకి లాభదాయకంగా మార్చేందుకు కసరత్తు చేస్తున్న అధికారులు ఈ ప్రయోగాన్ని సక్సెస్ చేస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని ఎలక్ట్రిక్ ఏసి సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే చిత్తూరులో ఒక బస్సును గ్యాస్ తో నడిపే ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. తాజాగా సూపర్ లగ్జరీ బస్సుకు సంబంధించి కుప్పం డిపో నుంచి ఎలక్ట్రిక్ విధానంలోకి మార్చడానికి బెంగళూరుకు సంబంధించిన ఒక సంస్థను సంప్రదించారు.

పాత బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా కన్వర్షన్
తిరుపతికి సంబంధించిన పాత బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడానికి పూణేకు చెందిన కళ్యాణి పవర్ ట్రైన్ లిమిటెడ్ సంస్థ ముందుకు వచ్చింది. ఇక వారం రోజుల క్రితం ఈ సంస్థతో ఎంఓయూ చేసుకున్న ఆర్టీసీ కావలసిన అనుమతిని ఆర్టీవో నుంచి కూడా పొందింది. ప్రస్తుతం పల్లెవెలుగు పేరుతో నడుస్తున్న బస్సును కన్వర్షన్ చేయడానికి అశోక లేలాండ్ సూపర్ లగ్జరీ బస్సును త్వరలోనే కన్వర్షన్ కోసం పంపించనున్నారు.

ఎలక్ట్రిక్ బస్సుగా మార్చి టెస్ట్ ట్రయల్
180 రోజులలో బస్సులో అవసరమైన మార్పులను చేసి, ఎలక్ట్రిక్ బస్సుగా మార్చి టెస్ట్ ట్రయల్ నిర్వహించి ట్రయల్ రన్ తర్వాత సంస్థ నుంచి అనుమతి పొందుతారు. ఆ తర్వాత మరో 60 రోజులపాటు విజయవాడ లేదా తిరుపతిలో ఈ బస్సుకు మరో మరో ట్రయల్ రన్ నిర్వహిస్తారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఆ తర్వాత ఆర్టీవో ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు.

బస్సు పర్ఫార్మెన్స్ పై సమీక్ష
అనంతరం డీజిల్ బస్సుకు ఉండే ఎల్లో బోర్డును తీసివేసి, ఎలక్ట్రిక్ బస్సు గ్రీన్ బోర్డును పెడతారు. ఒక రెగ్యులర్ రూట్ లో కొంతకాలం ఈ బస్సును నడుపుతారు. అనంతరం దీని పెర్ఫార్మెన్స్ పైన ఉన్నతాధికారుల సమీక్ష చేపట్టి, లోటుపాట్లను గుర్తిస్తారు. అంత సక్సెస్ అయితే మిగతా బస్సులను కూడా ఇదే తరహాలో మార్చడానికి సదరు ఎంఓయూ చేసుకున్న సంస్థకు బస్సులను పంపుతారు.

ఈ బస్సులతో నిర్వహణ ఖర్చులు సగానికి
ఈ విధానంలో పాత బస్సులను ఎలక్ట్రిక్ ఈ బస్సులుగా మార్చడంతో నిర్వహణ ఖర్చులు సగానికి తగ్గుతాయి. 36 సీట్లు సామర్థ్యంతో ఎలక్ట్రిక్ ఏసి సూపర్ లగ్జరీ బస్సు గా ఈ బస్సును మార్చడానికి కావలసిన అన్ని మార్పులు చేర్పులు చేస్తారు. ఇక వంద రూపాయల డీజిల్తో 5 కిలోమీటర్లు నడిచే బస్సులు, 50 రూపాయల కరెంటుతో ఐదు కిలోమీటర్ల పైగా ప్రయాణం చేస్తాయి. ఈ విధానంతో ఆర్టీసీకి ఖర్చు సగం తగ్గుతుంది. ఈ విధానం సక్సెస్ అయితే ఏపీలో పొల్యూషన్ ఫ్రీ జర్నీ సాధ్యమవుతుందని చెప్పవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+