ఏబీకి పదవి, అనూహ్య పరిణామం- మద్దతుగా టీడీపీ కేడర్..!!
కూటమి ప్రభుత్వంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గత ప్రభుత్వం టార్గెట్ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా దూరంగా ఉంచిన సీనియర్ ఐపీఎస్ ఏబీ వేంకటేశ్వర రావు వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వంలో సంచలనంగా మారింది. సీఎం చంద్రబాబు ఆయనకు ఏపీ పోలీస్ హౌసింగ్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికీ ఆయన బాధ్యతలు తీసుకోలేదు. ఏబీవీకి మద్దతుగా టీడీపీ కేడర్ రంగంలోకి దిగింది. ఇంతకీ ఏం జరుగుతోంది..
జగన్ హయాంలో
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వేంకటేశ్వర రావు 2014-19 చంద్రబాబు హయాంలో ఇంటలి జెన్స్ చీఫ్ గా పని చేసారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏబీ వేంకటేశ్వర రావుకు రిటైర్ అయ్యే రోజు వరకు పదవికి దూరంగా ఉంచారు. ఏబీవీ సైతం జగన్ ప్రభుత్వం పైన పోరాటం చేస్తూనే ఉన్నారు. కోర్టు ఆదేశాలతో రిటైర్మెంట్ రోజున ఆయనను తిరిగి సర్వీసులోకి తీసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చారు. అదే రోజున ఆయన పదవీ విరమణ చేసారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఏబీవీకి కీలక హోదా కల్పించాలని టీడీపీ కేడర్ పార్టీ నాయకత్వం పైన పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చింది.

పదవి ఇచ్చినా
ఇక, ఈ మధ్య కాలంలోనే ఏబీవీ కమ్మ సామాజిక వర్గ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక.. చంద్రబాబు తాజాగా ఆయన ఏపీ పోలీసు హౌసింగ్ కార్పోరేషన్ బాధ్యతలు అప్పగించారు. ఆయనతో పాటుగా మాజీ డీజీపీ ఠాకూర్ కు ఢిల్లీలోని ఏపీ భవన్‌కు ఇంఛార్జ్ గా సలహాదారు హోదాలో నియమించారు. ఈ నియామకం ఏబీవీతో పాటుగా జగన్ వేధింపులకు గురైన వ్యక్తిగా మద్దతుగా నిలిచిన టీడీపీ కేడర్ కు నచ్చ లేదు. ఏబీవీకి ఇదేనా ఇచ్చే గౌరవం అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఏబీవీ పైన జగన్ హయాంలో నమోదు చేసిన కేసులను కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకు సమీక్షించటం కూడా పార్టీ శ్రేణులకు నచ్చ లేదు. ఆ తరువాతనే ఆయనకు రావాల్సిన ఆర్దిక ప్రయోజనాలు విడుదల అయ్యాయి. జగన్ కారణంగా వేధింపులకు గురైన వారికి ఇదేనా ఇచ్చే విలువ అంటూ పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు.
నిర్ణయం మారేనా
ఏబీవీ కోసం టీడీపీని ఎన్నికల్లో గెలిపించేందుకు శక్తి మేర పని చేసిన కమ్మ సామాజిక వర్గంలోని ముఖ్యులు సైతం ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నారు. దీంతో.. ఏబీవీకి పోలీసు హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పటి వరకు ఏబీవీ తన పదవి స్వీకరించ లేదు. ఈ పదవి ఏబీవీకి సరైనది కాదనే అభిప్రాయం టీడీపీ నేతల్లోనే వినిపిస్తోంది. ఈ పదవి లోనే కొనసాగించాలే క్యాబినెట్ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తొలుత ఏబీవీకి ఆర్టీసీ ఛైర్మన్ ఇస్తారనే ప్రచారం సాగింది. అయితే, రిటైర్డ్ డీజీ తిరుమల రావుకు ఆ పదవి ఖరారు చేసారు. ఇక, ఇప్పుడు ఏబీవీ ఈ పదవి స్వీకరిస్తారా.. చంద్రబాబు తన నిర్ణయం పైన పునరాలోచన చేస్తారా అనేది పార్టీలో ఆసక్తి కర చర్చగా మారుతోంది.












Click it and Unblock the Notifications