రంగంలోకి దిగకముందే ఇలా: ఏపీ-టీలలో 175 స్థానాల్లో పవన్ కళ్యాణ్ రెడీ
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) జనసేన 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించినట్లుగా ప్రచారం సాగుతోంది.
హైదరాబాద్/అమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) జనసేన 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించినట్లుగా ప్రచారం సాగుతోంది.

175 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారని
అయితే, ఇందులో నిజం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తామని, ఏపీ, తెలంగాణలలో 294 నియోజకవర్గాలు ఉండగా 175 స్థానాల్లో పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించినట్లుగా ప్రచారం సాగింది.
Recommended Video


పవన్ కళ్యాణ్ మాట తీరు చూస్తే..
గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ మాట తీరు చూస్తుంటే ఆ వ్యాఖ్యలు నిజమే కావొచ్చునని అనిపిస్తాయి. ఎందుకంటే తన వద్ద రాజకీయ పార్టీ నడిపేంత డబ్బు లేదని, వచ్చేసారి పోటీ చేస్తామని, కానీ ఎక్కడెక్కడ పోటీ అనేది తర్వాత ఉంటుందని పవన్ చెప్పారు.

ఎన్నో రకాల ఊహాగానాలు
ఇప్పుడు, 175 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని చెప్పారని ప్రచారం సాగుతోంది. అంటే చంద్రబాబుకు అనుకూలంగా, జగన్‌కు వ్యతిరేకంగా ఆయా నియోజకవర్గాల్లో పవన్ అభ్యర్థులను నిలబెట్టవచ్చునని అప్పుడే కొందరు ఎవరికి వారు ఊహించుకుంటున్నారు. తమతో కలిసి వస్తాడనుకున్న బిజెపి - టిడిపికి ఇది షాక్ అని మరికొందరు అంటున్నారు.

పవన్ కళ్యాణ్ రంగంలోకే దిగలేదు కానీ
అయితే, తాము 175 స్థానాల్లోనే పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా వచ్చిన వార్తలు సరికాదని తెలుస్తోంది. అసలు జనసేన సీట్ల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇంకా ప్రత్యక్షంగా రంగంలోకే దిగలేదు.. అప్పుడే సీట్ల గురించి ఎలా మాట్లాడుతారనే వారు లేకపోలేదు.












Click it and Unblock the Notifications