మీడియా పాయింట్ వద్ద ఉద్రిక్తత: వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం
అమరావతి: అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ పార్టీలకు చెందిన సభ్యులు మాట్లాడేందుకు మీడియా పాయింట్ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో ఇరు పార్టీలకు చెందిన సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మీడియా పాయింట్ వద్ద వైసీపీ సభ్యులు నినాదాలతో నిరసన తెలియజేశారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ మీడియా సమావేశం వైసీపీ సభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి మీడియాతో మాట్లాడారు. వైసీపీ గొంతు నొక్కేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతను మాట్లాడనీయకుండా చేస్తున్నారన్నారు. మీడియా పాయింట్ వద్ద ఒక వ్యక్తి మాట్లాడిన తర్వాత ఇంకో వ్యక్తిని పిలవాలన్నారు.

కనీసం మీడియా పాయింట్ లో వైసీపీ సభ్యులను మాట్లాడనీయకుండా చేస్తున్నారన్నారు. ఇరు పార్టీల నేతలు పరస్పర ఆరోపణలకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు సర్దిచెబుతున్నారు. పోలీసులు రంగంలోకి పరిస్థితిని అదుపు చేశారు.
ప్రజల తరుపున మాట్లాడితే దౌర్జన్యం చేస్తారా?: చెవిరెడ్డి భాస్కరరెడ్డి
రౌడీయిజం చేస్తున్నారని మాపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మీడియా పాయింట్ వద్ద కూడా మా గొంతు నొక్కేస్తున్నారన్నారు. మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్నారు. ప్రజలత తరుపున మాట్లాడితే దౌర్జన్యం చేస్తారా? అని నిలదీశారు. మీడియా పాయింట్ వద్ద మాట్లాడాలంటే టీడీపీ అనుమతి కావాలా? అంటూ ప్రశ్నించారు.
మీడియా పాయింట్ వద్ద వైసీపీ సభ్యులు బైఠాయింపు
మీడియా పాయింట్ వద్ద టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మీడియా పాయింట్ వద్ద వైసీపీ సభ్యులు బైఠాయించారు. టీడీపీ సభ్యుల తీరుపై మండిపడుతున్నారు. టీడీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారంటూ నినాదాలు చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యం నశించాలని
శాసనసభ, స్పీకర్‌పై మాకు గౌరవం ఉంది: శ్రీకాంత్ రెడ్డి
శాసనసభ, స్పీకర్‌పై మాకు గౌరవం ఉందని వైసీపీ సభ్యుడు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయకుండా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రాయసీమ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారన్నారు. ఏపీకి ప్రత్యేకహోదాపై వైసీపీ చేస్తున్న ఆందోళనలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వాలన్నారు. మా పోరాట పంథాను ఎలా మార్చుకోవాలో పవన్ సూచించాలన్నారు.
మహిళా మార్షల్స్‌తో మాపై దాడి చేయించారు: గిడ్డి ఈశ్వరి
మహిళా మార్షల్స్‌తో మాపై దాడి చేయించారని వైసీపీ మహిళా సభ్యురాలు గిడ్డి ఈశ్వరి వ్యాఖ్యానించారు. మూడు రోజులుగా ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్నారు. సభా సమయాన్ని వృథా చేస్తున్నారన్నారు. మహిళా మార్షల్స్‌తో మాపై దాడి చేయించారన్నారు.
100 మంది మహిళా మార్షల్స్: ఉప్పులేటి కల్పన
మార్షల్స్‌ను అడ్డుపెట్టుకుని శాసనసభను నడిపించాలని చూస్తున్నారని వైసీపీ సభ్యురాలు ఉప్పులేటి కల్పన అన్నారు. మార్షల్స్‌ను అడ్డుపెట్టుకుని సభను నడిపించాలని చూస్తున్నారన్నారు. యాక్టివ్ గా ఉన్న నేతల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారన్నారు. వైసీపీ నేతల్ని అడ్డుకోవడానికి 100 మంది మహిళా నేతల్ని పెట్టారన్నారు. బంద్‌ను విఫలం చేయాలని చూస్తున్నారన్నారు. హోదా ఉద్యమాన్ని అణగదొక్కాలని చూస్తే, ఉవ్వెత్తున ఎగిసిపడుతుందన్నారు.
వైసీపీ సభ్యులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు: అనిత
వైసీపీ సభ్యులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని టీడీపీ సభ్యురాలు అనితి వ్యాఖ్యానించారు. ఆడవాళ్లను అడ్డుపెట్టుకుని వైపీసీ నీచరాజకీయాలు చేస్తోందన్నారు.












Click it and Unblock the Notifications