వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదు చేస్తే ఎస్సై దారుణం .. బాధితురాలిని బెదిరించి , ఆమె సోదరుడ్ని చితకబాది

|
Google Oneindia TeluguNews

ఏదైనా అన్యాయం జరిగితే న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్తారు. తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పి న్యాయం చేయమని పోలీసుల దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్తారు. ఇక పోలీసులు సైతం వారి ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. కానీ తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలం కుసుమ న పల్లి గ్రామంలో న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఆ పోలీస్ బాస్ దారుణంగా దాడి చేశారు. ఫిర్యాదు చేసిన గ్రామ వాలంటీర్ కృష్ణవేణి ని బెదిరించి , ఆమె సోదరుడి మీద దాడికి పాల్పడి ఇష్టారాజ్యంగా కొట్టారు. దీంతో ఆ బాధితురాలు పోలీస్ స్టేషన్ కి వెళ్తే న్యాయం జరగలేదని లబోదిబోమంటున్నారు.

నడి రోడ్డులో పెళ్లి చేసుకోవాలని యువతికి వేధింపులు, కన్నడ హీరోకు దేహశుద్ది !నడి రోడ్డులో పెళ్లి చేసుకోవాలని యువతికి వేధింపులు, కన్నడ హీరోకు దేహశుద్ది !

ఇక అసలు విషయానికి వస్తే కుసుమన పల్లి గ్రామంలో గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తున్న ఇరప కృష్ణవేణి అనే మహిళ తన భర్త వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త వేధింపులు తాళలేక తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. భర్త నుంచి ప్రాణ హాని ఉందని, తనని తన కొడుకుని కాపాడాలని ఆమె పోలీసులను కోరింది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు మూడు నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో కృష్ణవేణి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది.

S.I threatens a woman and beaten her brother in east godavari district

ఇక ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక ఎస్సై చినబాబు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. అయితే బాధితురాలితో స్టేషన్ కి వచ్చిన ఆమె సోదరుడు రమేష్‌ని గదిలో పెట్టి చావబాదాడు. ఎస్పీకి ఫిర్యాదు చేశారా అంటూ ఇష్టమొచ్చినట్లుగా కొట్టాడు. కృష్ణవేణి ని బెదిరించాడు . దీంతో బాధితురాలు లబోదిబో మంటోంది. తమకు న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఎస్సై.. తోడుగా వెళ్లిన బాధితురాలి సోదరుడి పై దాడి చేయడం అన్యాయం అని ఆదివాసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే ఎస్సై పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళితే అక్కడ కూడా అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆదివాసీలు ఎస్సై తీరుపై మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

English summary
A sub inspector threatened a victim and beaten her brother when she complained of harassment of her husband.This incident happened at Kusumanapalli. Adivasi communities are demanding justice for the victim as they go for justice and are attacked by the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X