దత్తత గ్రామంలో సచిన్
నెల్లూరు: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ దత్తత గ్రామం పీఆర్ కండ్రికలో పర్యటించారు. తాను దత్తత తీసుకున్న గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై హర్షం వ్యక్తం చేశారు. బుధవారం గ్రామానికి చేరుకున్న సచిన్ కు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో 1.15 కోట్ల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించి..గ్రామం మొత్తం పర్యటించారు. అనంతరం స్వచ్ఛభారత్ పై అధికారులతో సచిన్ ఇష్టాగోష్టి నిర్వహించారు. తాను దత్తత తీసుకున్న నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు వారి కండ్రిగ రెండేళ్లలోనే గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని కొనియాడారు.












Click it and Unblock the Notifications