గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Sajjala : కోటంరెడ్డి టీడీపీలోకే ? తేల్చేసిన సజ్జల- ఫోన్ ట్యాపింగ్ పై కీలక వ్యాఖ్యలు !

ఏపీలో నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లడం ఖాయమని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు.

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీతో విభేదిస్తున్న నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిజగన్ సర్కార్ పై ఫోన ట్యాపింగ్ విమర్శలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో కొద్దిరోజులుగా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి తీరుపై ఇవాళ స్పందించిన పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ఱారెడ్డి ఆయన టీడీపీలోకి వెళ్లడం ఖాయమనే సంకేతాలు ఇచ్చేశారు.

 కోటంరెడ్డి వ్యవహారంపై సజ్జల

కోటంరెడ్డి వ్యవహారంపై సజ్జల

నెల్లూరు జిల్లా వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత కొన్ని రోజులుగా చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన వద్దకు దూతల్ని పంపి సమస్య పరిష్కారానికి ప్రయత్నించిన వైసీపీ సర్కార్.. ఇందులో విఫలమైనట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ మీడియాతో మాట్లాడిన వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇక పార్టీలో ఉండటం కష్టమేనన్న భావన ఆయన మాటల్లో కనిపించింది. ఫోన్ ట్యాపింగ్ పేరుతో కోటంరెడ్డి చేస్తున్న విమర్శలపై సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు.

 టీడీపీలోకి వెళ్లడం ఖాయమన్న సజ్జల

టీడీపీలోకి వెళ్లడం ఖాయమన్న సజ్జల

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలపై సజ్జల స్పందించారు. కోటంరెడ్డి టీడీపీలోకి వెళ్ళటానికి నిర్ణయించుకున్న తర్వాత తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కోటంరెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముందని సజ్జల ఇవాళ ప్రశ్నించారు. ఆయనే తన ఉద్దేశాలు చెప్పిన తర్వాత చర్యలు ఏం తీసుకుంటామని ప్రశ్నించారు. తద్వారా తాము చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేకుండానే ఆయన టీడీపీలోకి వెళ్లిపోతున్నారన్న సంకేతాలు ఇచ్చినట్లయింది.

 ఫోన్ ట్యాపింగ్ పై సజ్జల కామెంట్స్

ఫోన్ ట్యాపింగ్ పై సజ్జల కామెంట్స్

ఇక రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డితో పాటు ఇదే జిల్లాలో మరో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపైనా సజ్జల స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు.
ముఖ్యమంత్రి జగన్ ప్రజలను నమ్ముకుని పాలన చేస్తున్నారని.. ఫోన్ ట్యాపింగ్‌లను నమ్ముకుని కాదని సజ్జల పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై ఎవరైనా ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. పదవి రాలేదని అసంతృప్తి ఉండటం వేరని.. బహిరంగంగా ఇటువంటి ఆరోపణలు చేయటం వేరన్నారు. కోటంరెడ్డి తిరుగుబాటు నేపథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గా ఇంకా ఎవరినీ నియమించ లేదని సజ్జల తెలిపారు.

English summary
ysrcp general secretary sajjala ramakrishna reddy on today confirmed rebel mla kotamreddy sridhar reddy's joining into tdp amid phone tapping allegations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X