అరెస్టుల వేళ.. వైసీపీలో కీలక భేటీ

Sajjala Ramakrishna Reddy: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాగన్ణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ.. రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల నిర్వహణపై దృష్టిపెట్టింది

దీనిపై ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి.. యువజన విభాగం కమిటీ నాయకులతో సమావేశం అయ్యారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ ఏర్పాటైంది. ఈ భేటీలో పార్టీ కేంద్ర కార్యాలయ ఇంఛార్జ్‌, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు, యూత్‌ వింగ్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బైరెడ్డి సిద్దార్ధ్‌ రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.

Sajjala Ramakrishna Reddy direction to the YSRCP s Youth wing leaders

ఈ సందర్భంగా సజ్జల రామ‌కృష్ణారెడ్డి మాట్లాడారు. పార్టీ యువనేతలకు దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు అలవికాని హామీలను ఇచ్చి, మాట తప్పిన చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేక పోరాటాలకు సంసిద్దంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ నిరసన గళం వినిపిస్తూనే ఉంటుందని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారని సజ్జల గుర్తు చేశారు. అన్ని వర్గాల వారినీ చంద్రబాబు ప్రభుత్వం మోసగించిందని ధ్వజమెత్తారు.

మహిళలు, విద్యార్ధులు, యువతకు చేస్తున్న అన్యాయం ఇలా ప్రతి అంశంపై పోరాటాలు, నిరసనల ద్వారా ప్రభుత్వం మెడలు వంచేలా పోరాడడం, అంకితభావం, కష్టపడేతత్వం, ప్రజలకు అండగా నిలిచే సామర్థ్యం ఉండే వ్యక్తులకు పార్టీ కమిటీల నియామకంలో ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు.

అలాంటి నాయకులకు రాజకీయంగా ఎదగడానికి ఇదే మంచి అవకాశం అని సజ్జల పేర్కొన్నారు. ప్రజలకు మాట ఇచ్చి తప్పిన కూటమి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేక పోరాటాలకు సంసిద్దంగా ఉండాలని, ప్రజలను విస్మరించి కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను జనంలోకి తీసుకెళ్ళడంలో నియోజకవర్గ ఇంఛార్జ్‌లు సమన్వయంతో ముందుకెళ్లాలని అన్నారు.

అక్రమ కేసులు, వేధింపులను గట్టిగా ఎదుర్కొని చంద్రబాబు కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లో ఎండగడదామని సజ్జల సూచించారు. జిల్లా కేంద్రాల నుంచి గ్రామ స్ధాయి వరకూ పార్టీ కమిటీల నియామకాన్ని యుద్దప్రాతిపదికన పూర్తిచేయాలని ఆయన జిల్లా అధ్యక్షులకు చెప్పారు.

టీడీపీ కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రజల్లోకి చొచ్చుకెళ్లిందని, మున్ముందు ఆందోళన కార్యక్రమాలను మరింత ముమ్మరంగా చేపట్టాల్సిన అవసరం ఉంటుందని సజ్జల అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడైనా ఈ ఆందోళనను అడ్డుకుంటే దానికి తగిన విధంగా వ్యవహరిద్దామని, ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్దతిలో నిరసనలు తెలియజేయాలని సజ్జల సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+