గడప గడపలో నిలదీతల వెనుక కారణమిదే- రెచ్చగొడుతున్న బాబు-సజ్జల సవాల్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి చేసుకుంటోంది. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమాన్ని ప్రజల్లోకి మరింతలోతుగా తీసుకెళ్లే లక్ష్యంతో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే ఇది ప్రారంభమైన తొలిరోజే మంత్రులు, ఎమ్మెల్యేలకు చుక్కలు కనిపించాయి. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దీని వెనుక ఉన్న కారణాల్ని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.

గడప గడపకూ ప్రభుత్వం
గడప గడపకూ ప్రభుత్వం పేరుతో వైసీపీ సర్కార్ ఏపీలో కొత్త కార్యక్రమం ప్రారంభించింది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్లి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చెబుతున్నారు. టీడీపీ వారి ఇంటికీ వెళ్లాలని సీఎం జగన్ ఎమ్మెల్యేలకు ఆదేశించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తెలుగు దేశం పార్టీ కి చెందిన వారింటికీ వెళ్తున్నారని వెల్లడించారు. తెలుగు దేశం పార్టీ కార్యకర్తల ఆశీస్సులు కూడా ఎమ్మెల్యేలు కోరుతున్నారన్నారు.

నిలదీతల వెనుక వాస్తవాలివే
టీడీపీ ప్రోద్భలంతో కొందరు సంక్షేమ పథకాలకు అర్హత లేకపోయినా ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని సలహాదారు సజ్జల ఆక్షేపించారు. ఇళాంటి వీడియోలు తీసి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను నిలదీస్తున్న వారు టీడీపీ కార్యకర్తలేనన్నారు. గతంలో తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉండగా ఎవరూ ఇంటింటికీ వెళ్లలేకపోయారని, సంక్షేమం,అభివృద్ధి జరుగుతుంటే కడుపు మంట తట్టుకోలేక తెలుగుదేశం వారు నిరసన అని క్రియేట్ చేస్తున్నారని సజ్జల విమర్శించారు.

అన్ని వీడియోలు పెట్టాలని సవాల్
మూడేళ్లలో ఇంత చేస్తున్నాం కాబట్టే గడపగడపకు వెళ్లగలుగుతున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల తెలిపారు.
వైఎస్ ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ అసంతృప్తితో లేరన్నారు. సీఎం జగన్ రాగానే అన్ని చోట్లా అవినీతి లేకుండా కట్టడి చేశారని, అభివృద్ధి చూడాలంటే ఓడిపోయిన తెలుగు దేశం నేతలు, అభ్యర్థులను కార్యక్రమానికి పంపాలని ఆయన కోరారు. దమ్ము ధైర్యం ఉంటే జరుగుతున్న వాటన్నిటినీ వీడియో చేసి పెట్టాలని సూచించారు.

చంద్రబాబు రెచ్చగొడుతున్నారన్న సజ్జల
అర్హత ఉండి సహాయం పొందలేని కౌలు రైతులంటూ ఎవరూ లేరని సజ్జల తెలిపారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లకు ఎందుకు ఏర్పాటు చేస్తున్నామనేది లక్ష సార్లు చెప్పామన్నారు. వ్యవసాయ మీటర్లు బిగింపు వెనుక డొంక తిరుగుడు ఏదీ లేదన్నారు. శాశ్వతంగా రైతులకు లబ్ది, డిపార్టుమెంట్ కు అకౌంటబులిటీ కోసం మీటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
మీటర్ల ఏర్పాటు వల్ల కేంద్రం నుంచి ఆర్ధికంగా వెసులుబాటు వస్తుందన్నారు. మీటర్లు బిగించడంలో తప్పేముందో అర్ధం కావడం లేదన్నారు. రైతులకు ఆత్మగౌరవంతో తనకు రావాల్సింది తీసుకునే పరిస్ధితి వస్తుందన్నారు.
మీటర్ల ఏర్పాటు శ్రీకాకుళంలో ప్రయోగాత్మకంగా చేపట్టి విజయవంతమైందని సజ్జల తెలిపారు. ఉచిత విద్యుత్ పై చంద్రబాబుకు చిత్తశుద్ది లేదని ఆయన అన్నారు. మీటర్ల ఏర్పాటుపై రైతులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని,
ప్రతి పక్షంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వంపై బండలు వేయాలని చూస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications