అలిపిరిలో చంద్రబాబుపై దాడి కేసు: సాకే కృష్ణను నిర్దోషిగా తేల్చిన కోర్టు
తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2003 అక్టోబర్ 1న జరిగిన దాడి కేసులో తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మావోయిస్టు దామోదరం అలియాస్ సాకే కృష్ణను కోర్టు నిర్దోషిగా తేల్చింది.
ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాధారాలు చూపించకపోవడంతో అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ తిరుపతి అదనపు సీనియర్ సివిల్ జడ్జీ సదానందమూర్తి మంగళవారం తీర్పు వెలువరించారు.

ఈ కేసులో 25వ నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొన్న దామోదరంను తిరుపతి టూటౌన్ పోలీసులు 2014లో బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. కాగా, ప్రాసిక్యూషన్ తరపున 52మంది సాక్షులు కోర్టులో సాక్ష్యం ఇచ్చారు.
కేసులో 14వ సాక్షిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, 13వ సాక్షిగా ఉన్న మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సాక్ష్యం చెప్పాలని కోర్టు సమన్లు పంపినా వారు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో న్యాయమూర్తి ఆ ఇద్దరి సాక్ష్యాలను నిలిపివేస్తూ ఇదివరకే ఉత్తర్వులు జారీ చేశారు.












Click it and Unblock the Notifications