బైక్‌పై దూసుకెళ్తూ..., కిల్లి కృపారాణి నిలదీత (పిక్చర్స్)

హైదరాబాద్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజైన బుధవారం నుంచి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు ఇన్‌ఛార్జిలలో కొందరు నిరవధిక, మరికొందరు రిలే దీక్షలకు శ్రీకారం చుట్టారు. దీంతో గత 64 రోజులుగా కొనసాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం మరో మలుపు తిరిగింది.

సీమాంధ్రలో సమైక్య ఉద్యమం రెండు నెలలు దాటినా కొనసాగుతోంది. సీమాంధ్రలోని పదమూడు జిల్లాల్లో సమైక్య ఉద్యమం జోరుగా సాగుతోంది. సమైక్యవాదులు ఆయా జిల్లాల్లో ప్రజాప్రతినిధులను, కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులను అడ్డుకుంటున్నారు.

విశాఖలోని ప్రభుత్వ అతిథి గృహం వద్ద కేంద్రమంత్రి కిల్లి కృపారాణి ఎదుట సమైక్యవాదులు ఆందోళనకు దిగారు. మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కిల్లి కృపారాణి

కిల్లి కృపారాణి

కేంద్రమంత్రి కిల్లి కృపారాణిని బుధవారం సమైక్యవాదులు అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

గుంజీలు తీస్తూ..

గుంజీలు తీస్తూ..

సమైక్యాంధ్రకు మద్దతుగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద గుంజీలు తీస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న పలువురు సమైక్యవాదులు.

బాపూజీ దగ్గర

బాపూజీ దగ్గర

సమైక్యాంధ్రకు మద్దతుగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద బాపూలాగా కర్ర, పంచె కట్టుకొని నిరసన తెలుపుతున్న ఓ సమైక్యవాది.

జాతీయ పతాకంతో

జాతీయ పతాకంతో

సమైక్యాంధ్రకు మద్దతుగా చేయి చేయి కలుపుదాం. సమైక్యాంధ్రను కాపాడుకుందామంటూ జాతీయ పతాకంతో ర్యాలీ తీస్తున్న సమైక్యవాదులు.

బుట్టలతో

బుట్టలతో

సమైక్యాంధ్రను కాపాడాలంటూ జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద బుట్టలతో నిరసన తెలుపుతున్న పలువురు సమైక్యవాదులు.

పొట్టి శ్రీరాములు వేషధారణలో

పొట్టి శ్రీరాములు వేషధారణలో

అమరజీవి పొట్టి శ్రీరాములు వేషధారణలో సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన తెలుపుతూ ద్విచక్రవాహనంపై దూసుకెళ్తున్న ఓ సమైక్యవాది.

ఊరేగింపు

ఊరేగింపు

పాతరేసపువాణి పాలెం గ్రామ సంఘం ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ తీస్తున్న సమైక్యవాదులు. దిష్టి బొమ్మలను ఊరేగించారు.

మహాత్ముడి మాస్కులతో

మహాత్ముడి మాస్కులతో

అనంతపురం జిల్లాలో సమైక్యాంధ్ర కోసం వినూత్న నిరసనలు తెలుపుతున్నారు. సమైక్యవాదులు మహాత్మా గాంధీ మాస్కులతో నిరసన తెలిపారు.

కర్నూలు

కర్నూలు

కర్నూలులో సమైక్యాంధ్రకు మద్దతుగా చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. దీంతో కూడలిలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు.

వైయస్సార్ కాంగ్రెసు

వైయస్సార్ కాంగ్రెసు

ప్రకాశం జిల్లా ఒంగోలులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో బుధవారం సత్యాగ్రహ దీక్షలు ప్రారంభమయ్యాయి. సీమాంధ్ర వ్యాప్తంగా ఆ పార్టీ దీక్షలు ప్రారంభించింది.

విజయనగరం

విజయనగరం

విజయనగరంలో సమైక్యాంధ్రకు మద్దతుగా జరిగిన సమైక్యాంధ్ర నారీ భేరీలో పాల్గొన్న సమైక్యవాదులు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు.

నారీ భేరీ

నారీ భేరీ

విజయనగరంలో సమైక్యాంధ్రకు మద్దతుగా జరిగిన సమైక్యాంధ్ర నారీ భేరీలో పాల్గొన్న సమైక్యవాదులు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. తెలుగు తల్లి వేషధారణలో..

విజయవాడలో రైతు మహాగర్జన

విజయవాడలో రైతు మహాగర్జన

కృష్ణా జిల్లా విజయవాడలో సమైక్యాంధ్రకు మద్దతుగా రైతు మహా గర్జన జరిగింది. ఇందులో ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రమాణం

ప్రమాణం

చిత్తూరు జిల్లా తిరుపతిలో సమైక్యాంధ్రకు కట్టుబడి ఉంటామని ప్రమాణం చేస్తున్న సమైక్యవాదులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+