అన్నమయ్యకు శాంతా క్లాజ్ టోపీ-తిరుపతిలో అపచారం..!
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మరో అపచారం చోటు చేసుకుంది. ఇప్పటికే ప్రభుత్వాలు మారుతున్నా తిరుపతిలో పరిస్ధితులు మాత్రం మారడం లేదని, అన్యమత వస్తువులు, మత మార్పిడులు, అన్యమత ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్న వేళ తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. కొందరు అగంతకలు తిరుపతిలో ఏకంగా అన్నమయ్య విగ్రహానికే శాంతా క్లాజ్ టోపీ పెట్టారు. దీంతో హిందూ భక్తులు భగ్గుమంటున్నారు.
అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ పెట్టిన ఘటనపై తిరుపతిలో హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. విషయం తెలియగానే భజరంగ్ దళ్ తో పాటు ఇతర హిందూ సంఘాల నాయకులు అక్కడికి చేరుకుని నిరసనకు దిగాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. భజరంగ్ దళ్ కార్యకర్తలున్యాయం కావాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.

తిరుపతిలో అన్నమయ్య విగ్రహానికి జరిగిన అపచారాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మం అని చెప్పే పవన్ కళ్యాణ్ స్వామి ఇప్పుడు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. 32 వేల సంకీర్తనలతో వెంకటేశ్వర స్వామి మనసు గెలుచుకున్న అన్నమయ్య విగ్రహానికి అపచారం జరిగితే కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న ఈ చర్య పై చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ లు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు..












Click it and Unblock the Notifications