తెలంగాణలో సరస్వతీ పుష్కరాలు, ప్రత్యేకతలు - టెంట్ సిటీ, జాయ్ రైడ్..!!
సరస్వతీ పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15వ తదీ నుంచి 26వ తేదీ వరకు తెలం గాణలోని కాళేశ్వరం ఈ పుష్కరాల నిర్వహణకు తుది ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సారి పుష్కరా లకు ప్రత్యేకత ఉంది. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ఈ సారి ప్రభుత్వం కొత్త సదుపాయాలు అందుబాటులోకి తెచ్చింది. టెంట్ సిటీతో పాటుగా జాయ్ రైడ్ ను సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే రవాణా సదుపాయాలను రద్దీకి అనుగుణంగా నిర్ణయించారు.
పుష్కరాల వేళ
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుంచి సరస్వతీ పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. పుణ్య స్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా మంత్రులు శ్రీధర్ బాబు.. సురేఖ పుష్కరాల పై సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. జరగబోయే సరస్వతి పుష్కరాల్లో హెలికాప్టర్ ప్రయాణం అందుబాటులోకి రానుంది. పుష్కరాలకు వచ్చిన భక్తులు కాళేశ్వరం ఆలయం, పుష్కర ఘాట్‌లు, చుట్టూ ఉన్న పచ్చటి అందాలను గగనతలం నుంచి వీక్షించేలా రాష్ట్ర ప్రభుత్వం 'జాయ్‌రైడ్'ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ఒకేసారి 6 గురు ప్రయాణించేందుకు వీలుగా ఎయిర్‌బస్ హెచ్-125 మోడల్ హెలికాప్టర్‌ను వినియోగించనుంది.

జాయ్ రైడ్
జాయ్ రైడ్ టికెట్ ధరను ఒక్కొక్కరికీ రూ.4,500 చొప్పున ఖరారు చేయగా.. ప్రయాణ సమయాన్ని 6-7 నిమిషాలుగా నిర్ణయించారు. హెలికాప్టర్ ప్రయాణాలకు అవసరమైన సాంకేతిక అనుమతు , ఇతరత్రా వ్యవహారాలు మొత్తం ఇప్పటికే పూర్తయ్యాయి. ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకే జాయ్‌రైడ్‌లను నిర్వహించనున్నారు. కాగా, ఈ హెలికాప్టర్ ప్రయాణాల బాధ్యతలను బెంగళూరు చెందిన ఓ సంస్థకు అప్పగించారు. జాయ్‌రైడ్‌లకు అవసరమైన సాంకేతిక అనుమతులను సదరు సంస్థే ఏర్పాటు చేసుకుంటుంది. పుష్కర ఘాట్‌లకు దగ్గర్లోనే హెలికాప్టర్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దేవాదాయ, పర్యాటకశాఖలతో పాటు సివిల్ ఏవియేషన్ విభాగం సంయుక్తంగా హెలికాప్టర్ ప్రయాణాలను పర్యవేక్షించనున్నాయి.
హెలికాఫ్టర్ ప్రయాణం
గతంలొ దేవాదాయ శాఖ మేడారం జాతరలోనూ హెలికాప్టర్ ప్రయాణాలను ఏర్పాటు చేసింది. అప్పుడు భక్తుల నుంచి మంచి ఆదరణ రావడంతో సరస్వతి పుష్కరాల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. కాగా, బెంగళూరు నుంచి కాళేశ్వరానికి మళ్లీ ఇక్కడి నుంచి అక్కడకు హెలికాప్టర్ ఖాళీగా వచ్చి, వెళ్లాల్సిన నేపథ్యంలో రూ.20 లక్షలను ప్రభుత్వం చెల్లించనుంది. అదే విధంగా హెలిప్యాడ్‌కు దగ్గర్లో అంబులెన్స్‌లు, అగ్నిమాపక బృందాలను అందుబాటులో ఉంచనుంది. ఇక పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం టెంట్ సిటీ ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా భక్తులకు పూర్తి సమాచారం అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications