పరారీలో సూత్రధారి: శాటిలైట్ టీవీ 'జాదూ' వీరే(పిక్చర్స్)
హైదరాబాద్: కేబుల్ టివిల సిగ్నల్స్‌ను పైరసీ చేసి విదేశాల్లో ప్రసారం చేస్తున్న ముఠా గుట్టును సిసిఎస్ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా గత ఆరేడేళ్లుగా అత్యాధునిక సాంకేతిక పరిజానాన్ని ఉపయోగించి టివి సిగ్నల్స్ పైరసీ చేస్తోంది. ఆ సిగ్నల్స్‌ను జాదు టివి పేరిట ఇంటర్నెట్ ద్వారా అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియాలతోపాటు పలు దేశాల్లో ప్రసారం చేస్తూ కోట్లలో సొమ్ము చేసుకుంటోంది. దీంతో మా టివి, జీ టివి వంటి ప్రధాన నెట్‌వర్క్‌లకు పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లుతోంది.
దీనిపై మా టివి నెట్‌వర్క్ లిమిటెడ్ డిస్ట్రిబ్యూషన్ మేనేజర్ కృష్ణ కుమార్ సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన సిసిఎస్ పోలీసులు జూదు టివి ఆగడాలను బట్టబయలు చేశారు. ఈ కేసులో పేర్ల్ టెక్నాలజీ ఇంజనీర్ కాషీఫ్ అలీ ఖాన్ (27), చానెల్ మానిటర్ జగదీశ్వర చారి, టెలీ కాలర్ ఎన్ సాయికుమార్, వెబ్ డిజైనర్ జెబి మేఘనందన్ అనే నలుగురి నిందితుల్ని అరెస్ట్ చేశారు. పేర్ల్ టెక్నాలజీ సిఇవో, ప్రధాన నిందితుడు సుమిత్ అహుజా పరారీలో ఉన్నాడు.
నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి ఆదివారం జాదు టివి ముఠా ఆగడాలను మీడియాకు వెల్లడించారు. పేర్ల్ టెక్నాలజీ సిఇవో సుమిత్ అహుజా గత కొన్నేళ్లుగా తన కంపెనీ ద్వారా దేశీయ కేబుల్ టివి సిగ్నల్స్‌ను పైరసీ చేసి వాటిని అమెరికాకు చెందిన జాదు నెట్‌వర్క్‌కు స్ట్రీమింగ్ చేస్తున్నాడు. ఈ పైరసీ వల్ల ఎలాంటి నెలవారీ చెల్లింపులు చేయకుండానే దాదాపు 115 ఛానల్స్ చూసే అవకాశం ఉంటుంది.
దీంతో అనతికాలంలోనే జాదు టివి నెట్‌వర్క్ అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్‌తోపాటు మరో పలు దేశాలకు వ్యాపించింది. ఒక్కో సెట్ ఆప్ బాక్స్ ధర 250 నుంచి 300 డాలర్లుగా నిర్ణయించి దాదాపు 2 లక్షల వరకు బాక్స్‌లను విక్రయించి కోట్లలో సొమ్ము చేసుకున్నారు. తరచూ మకాం మారుస్తూ దేశంలోని బెంగళూర్, హైదరాబాద్‌తోపాటు మరికొన్ని నగరాల ద్వారా దందా సాగించారు. తాజాగా ఈ ముఠా సికింద్రాబాద్ తిరుమలగిరి ప్రాంతానికి మకాం మార్చి తతంగం నడిపిస్తున్నారు.
కేబుల్ టివి సిగ్నల్స్ పైరసీతో ప్రముఖ టివి డిస్ట్రిబ్యూషన్ సంస్థలకు పెద్ద మొత్తంలో నష్టం వచ్చింది. దీంతో మా టివి నెట్‌వర్క్ సిసిఎస్ పోలీసులను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన పోలీసులు జాదు టివి సిగ్నల్స్ పైరసీ గుట్టును రట్టు చేశారు. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి సుమిత్ అహుజా కోసం గాలింపు ముమ్మరం చేశారు. అతడిపై రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేయనున్నారు.

జాదూ టీవీ
ఏకంగా 115 ఛానళ్లను 15 దేశాలకు.. హైదరాబాద్ కేంద్రంగా జాదూ ఛానల్ చేసిన మాయలో తేలిన లెక్క ఇది. ఛానల్‌కు పునాది రాయి వేసిన సుమిత్ అహుజా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సీసీఎస్ పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను పోలీసు కమిషనర్ ఎం మహేందర్ రెడ్డి, అదనపు కమిషనర్ అంజనీకుమార్, స్పెషల్‌బ్రాంచ్ సంయుక్త కమిషనర్ బి.మల్లారెడ్డి, సీసీఎస్ ఉపకమిషనర్ జి పాలరాజుతో కలిసి ఆదివారం వెల్లడించారు.

జాదూ టీవీ
115 ఛానళ్ల వీడియో సిగ్నల్స్‌ను ఇంటర్నెట్ ప్రొటోకాల్ సిగ్నల్‌గా మార్చి 15 దేశాలకు అందజేశారు. వాస్తవానికి జాదూ టీవీ అమెరికాకు చెందినది. దీన్ని ఫైసల్ అఫ్తాబ్, మాజిద్ సోహైల్ నడుపుతున్నారు. దీనికి సీఈవో సుమిత్ అహుజా. పెరల్ టెక్నాలజీ పేరుతో జాదూ ఛానల్‌ను ప్రారంభించారు. మనదేశంలో జాదూ ఛానల్‌కు బెంగళూరులో పునాది రాయి పడింది. తర్వాత దీన్ని హైదరాబాద్‌లోని తిరుమలగిరికి మార్పు చేశారు.

జాదూ టీవీ
జాతీయ, ప్రాంతీయ వినోదపు ఛానళ్ల వీడియో సిగ్నల్స్‌ను ఇంటర్నెట్ ప్రొటోకాల్ సిగ్నల్స్‌గా మార్పు చేసి విదేశాల్లో స్థిరపడ్డ తెలుగు వారికి, ఇతర భాషల వారికి ప్రసారం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా సెటప్ బాక్స్‌ను రూపొందించారు. ఈ బాక్స్‌లు ఉన్న వారికి మాత్రమే జాదూ ఛానల్ ప్రసారాలు అందుతాయి. ఈ విధంగా అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్‌తో పాటు మొత్తం 15 దేశాల్లో ఉన్న వారికి 2 లక్షల జాదూ సెటప్ బాక్స్‌లను విక్రయించారు. మనదేశ కరెన్సీ ప్రకారం 15 నుంచి 18 వేల రూపాయలకు వీటిని అమ్ముకున్నారు. ఈ సెటప్‌బాక్సుల్లో 550 ఛానళ్లను ప్రసారం చేసే సామర్థ్యం ఉంది.

జాదూ టీవీ
జాదూ ఛానల్ సెటప్‌బాక్స్‌లకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. విదేశాల్లో స్థిరపడ్డ వారు ఆన్‌లైన్ ద్వారా ఈ బాక్సులను కొనుగోలు చేశారు. సిగ్నల్స్ పైరసీ అయిన జాబితాలో జీ, మా టీవీతో పాటు ఇతర జాతీయ వినోద ఛానళ్లు ఉన్నాయి. ఇవే కాకుండా బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాలకు చెందిన ఛానళ్లను వీరు ఆ 15 దేశాలకు ప్రసారం చేశారు. ఇక్కడ ఛానల్ ప్రసారం ప్రారంభమైన ఆరు సెకన్లలో విదేశాల్లో ఉన్న వారు దాన్ని తిలకిస్తారు.












Click it and Unblock the Notifications