విశాఖపట్నం- చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు: తేదీలు, హాల్ట్ స్టేషన్లు
Special Trains: పండగ సీజన్ లో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది.
సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు- పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు. దీపావళి పండగల సమయంలో ఏర్పడే రద్దీని ఎదుర్కొనడానికి సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశవ్యాప్తంగా రద్దీ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్నారు. గతంలో ప్రకటించిన ప్రత్యేక రైళ్లనూ పొడిగిస్తూ వస్తోన్నారు.

- తాజాగా చర్లపల్లి నుంచి విశాఖపట్నానికి రెండు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. దీపావళి పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు.
- ఈ నెల 21 తేదీ అంటే మంగళవారం సాయంత్ర 5:30 నిమిషాలకు విశాఖపట్నం నుంచి బయలుదేరే నంబర్ 08541 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
- ఈ నెల 22వ తేదీ అంటే బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరే నంబర్ 08542 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 7 గంటలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది.
- దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్లగొండ మీదుగా ఈ ప్రత్యేక రైలు రాకపోకలు సాగిస్తుంది.












Click it and Unblock the Notifications