ఉత్తరాది రాష్ట్రాలతో తెగిన కనెక్టివిటీ: రైళ్లన్నీ రద్దు
Vijayawada floods 2024: రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల ప్రభావం రైళ్ల రాకపోకలపై తీవ్రంగా పడింది. పలు చోట్ల రైలు పట్టాలు కొట్టుకుపోయాయి. కొన్నిచోట్ల పట్టాలపై వరదనీరు ప్రవహిస్తోంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇప్పటికే పలు మార్గాల్లో రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించారు.
ఉత్తరం- దక్షిణాది రాష్ట్రాలను కలిపే ప్రధాన మార్గం.. విజయవాడ, ఖమ్మం. భారీ వర్షాలు, వరదల వల్ల ఈ రెండు రూట్లూ తీవ్రంగా దెబ్బతిన్నాయి. మహబూబాద్ జిల్లా కేసముద్రం వద్ద రైలు పట్టాలు ధ్వంసం అయ్యాయి. ఓవర్ హెడ్ లైన్ మొత్తం దెబ్బతిన్నది. పట్టాల కింద భూమి కొట్టుకుపోయింది. పట్టాలు పలుచోట్ల గాల్లో వేలాడే పరిస్థితి నెలకొంది.

ఇదే తీవ్రత ఇటు విజయవాడ మార్గంలోనూ నెలకొంది. రాయనపాడు రైల్వే స్టేషన్ నీట మునిగింది. అనేక ప్రాంతాల్లో పట్టాలపై వరద నీరు ప్రవహిస్తోంది ఇప్పటికీ. మట్టి ఎంత మేర కోసుకుపోయిందనే విషయం సైతం అంతుచిక్కట్లేదు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని దక్షిణమధ్య రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించారు.
దానాపూర్- ఎస్ఎంవీటీ బెంగళూరు రైలును ఖాజీపేట్, సికింద్రాబాద్, సూలేహళ్లి, గుంతకల్, ధర్మవరం మీదుగా మళ్లించారు. అహ్మదాబాద్- చెన్నై సెంట్రల్ రైలు సూరత్, జల్గావ్, మన్మాడ్, ధౌండ్, వాడి, గుంతకల్, రేణిగుంట మీదుగా, యశ్వంత్‌పూర్- తుగ్లకాబాద్ రైలును ధర్మవరం, గుంతకల్, వాడి, దౌండ్, మన్మాడ్, ఇటార్సీ మీదుగా, పటేల్ నగర్- రాయపురం రైలును ఖాజీపేట్, సికింద్రాబాద్, సూలేహళ్లి, గుంతకల్, రేణిగుంట మీదుగా మళ్లించారు.
మరో 18 రైళ్లను రద్దు చేసినట్లు తాజాగా వెల్లడించారు. దీని ప్రకారం.. 17233 సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్‌నగర్, 17234 సిర్పూర్ కాగజ్‌నగర్- సికింద్రాబాద్, 12783 విశాఖపట్నం- సికింద్రాబాద్, 22203 విశాఖపట్నం- సికింద్రాబాద్, 12774 సికింద్రాబాద్- షాలిమార్, 12772 షాలిమార్- సికింద్రాబాద్ రైళ్లు రద్దయ్యాయి.
22204 సికింద్రాబాద్- విశాఖపట్నం, 12864 ఎస్ఎంవీటీ బెంగళూరు- హౌరా, 17487 కడప- విశాఖపట్నం, 17409 ఆదిలాబాద్- నాందెడ్, 17410 నాందెడ్- ఆదిలాబాద్, 12805 విశాఖపట్నం- సికింద్రాబాద్, 18463 భువనేశ్వర్- కేఎస్ఆర్ బెంగళూరు ఎక్స్‌ప్రెస్ అందుబాటులో ఉండట్లేదు.
22701 విశాఖపట్నం- గుంటూరు, 20707 సికింద్రాబాద్- విశాఖపట్నం, 20708 విశాఖపట్నం- సిికింద్రాబాద్, 20833 విశాఖపట్నం- సికింద్రాబాద్, 20834 సికింద్రాబాద్- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తాజాగా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.












Click it and Unblock the Notifications