సికింద్రాబాద్-తిరుపతి, విజయవాడ-చెన్నై వందే భారత్ లకు గుడ్ న్యూస్..!
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఇప్పుడు వందే భారత్ మొదటి ఆప్షన్ గా మారుతోంది. ఇప్పటికే విజయవంతంగా పరుగులు తీస్తున్న వందే భారత్ రైళ్లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని రైల్వే కూడా పలు మార్పులు చేర్పులు చేస్తోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో రాకపోకలు సాగిస్తున్న రెండు కీలక వందే భారత్ రైళ్లలో మార్పులు చోటు చేసుకోనున్నాయి.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 7 రైళ్లలో ఐదింటికి ఇప్పటికే ఆక్యుపెన్సీ పెరిగినట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. ఇందులో రెండు రైళ్ల ఆక్యుపెన్సీ, ప్రయాణికుల ఆదరణను దృష్టిలో ఉంచుకుని వాటి బోగీలు పెంచేందుకు రైల్వే వర్గాలు సిద్ధమవుతున్నాయి. ఇందులో ఒక రైలుకు బోగీల పెంపుపై ఇప్పటికే స్థానిక అధికారులకు సమాచారం కూడా అందింది. మరో రైలుకు కూడా బోగీల పెంపుపై త్వరలో ప్రకటన రానుంది.

సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడుస్తున్న వందే భారత్ రైలుకు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునని ప్రస్తుతం ఉన్న 16 బోగీలకు తోడు మరో నాలుగు బోగీలు ఏర్పాటు చేసేందుకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో త్వరలోనే 20 బోగీలతో సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు తీయనుంది. అలాగే విజయవాడ-చెన్నై వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ఈ నెలలోనే నర్సాపూర్ వరకూ పొడిగించడంతో పాటు రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు బోగీల్ని చేర్చాలని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై త్వరలోనే ప్రకటన రానుంది.

మరోవైపు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మొత్తం ఆరు మార్గాల్లో 7 వందే భారత్‌లు నడుస్తుస్తున్నాయి. వీటిలో ఐదింటిలో ప్రయాణికుల ఆక్యుపెన్సీ 115 నుంచి 135 శాతంగా ఉంటోంది. సికింద్రాబాద్-విశాఖ వందే భారత్ లు పూర్తి సామర్ధ్యం (20 బోగీలు)తో నడుస్తున్నందున ఇందులో మార్పులు చేయడానికి ఏమీ లేదు. ఇక మిగిలిన వాటిలో సికింద్రాబాద్-తిరుపతి, విజయవాడ-చెన్నై (త్వరలో నర్సాపూర్-చెన్నై)తో పాటు జాల్నా-ముంబై వందే భారత్ లకు బోగీలు పెంచుతున్నారు. ఈ రైలు 8 బోగీలతో నడుస్తుండగా ఈ నెల 26 నుంచి 16 కోచ్‌లకు పెంచి నాందేడ్ వరకు పొడిగించారు. మరోవైపు సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందే భారత్‌కు ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో కోచ్ లను 8కి తగ్గించారు. కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ కూ ఆదరణ తక్కువే ఉంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications