సికింద్రాబాద్-విశాఖ వందే భారత్ టైమ్ మళ్లీ మార్పు..! రీజన్ ఇదే..!
సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ఈ మధ్య కాలంలో దక్షిణ మధ్య రైల్వే రెగ్యులర్ గా రీషెడ్యూల్ చేస్తోంది. ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు మ్యాచింగ్ రైలు సమయాల్లో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా దీని సమయాలను తరచుగా మారుస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఇలా రీషెడ్యూల్ చేసిన సికింద్రాబాద్-విశాఖ వందే భారత్ రైలును ఇవాళ కూడా రీషెడ్యూల్ చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటన చేసింది.
ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ లో బయలుదేరి విశాఖకు వెళ్లాల్సిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును రీషెడ్యూల్ చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన చేసింది. ఈ రైలు మధ్యాహ్నం 3 గంటలకు బదులుగా రాత్రి 10 గంటలకు విశాఖక బయలుదేరుతుందని అధికారులు ప్రకటించారు. ఇవాళ ఒక్కరోజే ఈ మార్పు అమల్లో ఉంటుంది. ఈ రైలుకు మ్యాచింగ్ రైలు ఆలస్యంగా నడుస్తుండటం వల్ల ఈ మార్పు చేసినట్లు అధికారులు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణాలు చేస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు సకాలంలో రాకపోకలు సాగించే విషయంలో మాత్రం వెనుకబడుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే పలు వందే భారత్ రైళ్లు నిర్ణీత సమయంలో గమ్యాలకు చేరడం లేదనే ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సికింద్రాబాద్-విశాఖ వందే భారత్ రైలును కూడా పదే పదే సమయాలు మారుస్తుండటం వల్ల ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే తప్పనిసరి పరిస్ధితుల్లోనే ఇలా మార్పులు చేయాల్సి వస్తోందని అధికారులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications