విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అరకు ఎమ్మెల్యే కాల్చివేత నేపథ్యంలో ప్రతిపక్ష నేత జగన్ కు భద్రత పెంపు

|
Google Oneindia TeluguNews

Recommended Video

అరకు ఎమ్మెల్యే కాల్చివేత నేపథ్యంలో జగన్ కు భద్రత పెంపు

విశాఖపట్టణం:అరకు ఎమ్మెల్యే ని మావోయిస్టులు కాల్చిచంపిన ఘటన నేపథ్యంలో వైసీపీ అధ్యక్షుడు,ఎపి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతను పోలీసులు మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేపై మావోయిస్టుల దాడి జరిగిన విశాఖ జిల్లాలోనే ప్రస్తుతం జగన్ పాదయాత్ర కూడా జరుగుతుండటం గమనార్హం.

దీంతో అప్రమప్తమైన పోలీసులు జగన్ కు పటిష్ట భధ్రతా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు జగన్ పాదయాత్ర రూట్ మ్యాప్ ను అడిగి తీసుకున్న పోలీసులు ఆయా మార్గాల్లో తనిఖీలు,సోదాలతో రక్షణ చర్యలను చేపట్టనున్నట్లు తెలిసింది. జగన్ తండ్రి వైస్ రాజశేఖర్ రెడ్డి గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మావోయిస్టుల నిర్మూలనలో కీలకపాత్ర పోషించిన నేపథ్యంలో జగన్ భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

తన క్వారీ వద్దకు వెళుతున్న అరకు ఎమ్మెల్యే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమను డుంబ్రీగూడా మండ‌లం లిప్పిట్టిపుట్టు వద్ద మావోయిస్టులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇదే జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసిపి అధినేత జగన్ కు మరింత భద్రత పెంచాలని పోలీసులు నిర్ణయించారు.

Security has increased to the Opposition Leader Jagan...wake of the Maoists assassination

జగన్ పాదయాత్ర రూట్ మ్యాప్ ను అడిగి తీసుకున్న పోలీసులు ఆయా మార్గాల్లో పటిష్ట రక్షణ చర్యలు పాటించాలని, పూర్తి భద్రత కల్పించాలని నిర్ణయించారు. జగన్ రాత్రి వేళ బస చేసే ప్రాంతం వద్ద కూడా భద్రతను మరింత పెంచనున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

వైఎస్ జగన్ పాదయాత్ర 268 వ రోజు విశాఖ జిల్లాలో 268వ రోజు ఆదివారం ఉదయం ఏడున్నర గంటలకు ఆనందపురం మండలం గండిగుండం క్రాస్‌ నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర గండిగుండం కాలనీ, అక్కిరెడ్డిపాలెం, జుత్తాడ క్రా స్, పాత్రుళ్లునగర్, రాయవరపువానిపాలెం గ్రామాల మీదుగా సరిపల్లి కాలనీ వరకు సాగనుంది. అయితే 269 వ రోజు జగన్ పాదయాత్ర విశాఖ జిల్లాలో ముగిసి విజయనగరం జిల్లాలోకి ప్రవేశించనుండటం గమనార్హం.

English summary
Police are making more efforts to secure the safety of the YCP President, Opposition Leader YS Jaganmohan Reddy in the wake of the Maoists' assassination of Araku MLA. Jagan Pradayatra present continuing in the Visakhapatnam district where Maoists attack happend.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X