వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'స్పందన' కార్యక్రమానికి వస్తున్న స్పందన చూసి .. ఏపీ సర్కార్ మరో మందడుగు

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన వస్తోంది. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారులకు విన్నవించుకుంటున్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా అధికారుల పని తీరులో మార్పు మాత్రమే కాకుండా ప్రజలకు సైతం తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఒక భరోసా వచ్చిందని జగన్ సర్కార్ భావిస్తోంది. అందుకే ప్రతి సోమవారం ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని ప్రజలకు మరింత దగ్గరయ్యేలా చేసేందుకు ఆన్లైన్ సేవలు సైతం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు జగన్. అందులో భాగంగా దీనితో పాటు టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రారంభించారు.

<strong>వరంగల్ న్యాయస్థానం సంచలన తీర్పు ..బీజేపీనేత హత్యకేసులో ప్రస్తుత సర్పంచ్ తో పాటు 15 మందికి జీవిత ఖైదు</strong>వరంగల్ న్యాయస్థానం సంచలన తీర్పు ..బీజేపీనేత హత్యకేసులో ప్రస్తుత సర్పంచ్ తో పాటు 15 మందికి జీవిత ఖైదు

Recommended Video

విశాఖ వెస్ట్ నూతన ఏ.సి.పి గా జి.స్వరూపా రాణి
 వైసీపీ సర్కార్ ప్రతిష్టాత్మక కార్యక్రమం స్పందనకు మంచి స్పందన

వైసీపీ సర్కార్ ప్రతిష్టాత్మక కార్యక్రమం స్పందనకు మంచి స్పందన

వైసీపీ సర్కార్ స్పందన కార్యక్రమం చాలా సత్ఫలితాలను ఇస్తుంది. ఇటీవల పోలీస్ శాఖకు వచ్చిన ప్రతి వినతిని గరిష్టంగా 15 రోజుల్లో పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకొని, 97 శాతం వినతులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించారు. ఇక ఒక్క పోలీస్ శాఖలోనే కాదు ప్రతీ శాఖా పరంగా వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. గతంలో గ్రీవెన్స్ సెల్ నిర్వహించి సమస్యల పరిష్కారం కోసం అధికారులు పని చేసిన దాని కన్నా స్పందన ద్వారా అధికారుల పనితీరు మెరుగుపడింది. అందుకు కారణం వారం వారం సీఎం జగన్ స్పందన కార్యక్రమం మీద సమీక్షలు నిర్వహించి తగు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. దీంతో స్పందన పట్ల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు.

 స్పందన ఆన్ లైన్ సేవలను, టోల్ ఫ్రీ నంబర్ ను ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం

స్పందన ఆన్ లైన్ సేవలను, టోల్ ఫ్రీ నంబర్ ను ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం


అందుకే ప్రతి సోమవారం ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని ప్రజలకు మరింత దగ్గరయ్యేలా చేసేందుకు ఆన్లైన్ సేవలు సైతం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న జగన్. అందులో భాగంగా దీనితో పాటు టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రారంభించారు. ఇక స్పందన సేవలను మరింత విస్తృతం చేయాలని భావించిన జగన్ సర్కార్ అందుకు ఆన్లైన్ సేవలను, టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తెచ్చింది. దరఖాస్తు చేసిన అర్జీ పరిస్థితి తెలుసుకునేందుకు టోల్‌ ఫ్రీ నంబర్‌ : 1800-425-4440 , మరియు spandana.ap.gov.in వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. సోమవారం మాత్రమే కాకుండా ఎప్పుడైనా ఎవరయినా ఎక్కడినుంచైనా నేరుగా ఆన్‌లైన్‌లో తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను పంపించే వెసులుబాటు కల్పించింది.
అంతేకాదు మన సమస్యకు సంబంధించిన అర్జీని పంపించడంతో పాటు గా ఎప్పటికప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం అధికారులు తీసుకుంటున్న అటువంటి చర్యలను సంబంధిత అర్జీ స్టేటస్ లో తెలుసుకునే లాగా చర్యలు తీసుకుంటుంది.

ప్రజల, అధికారుల సమయం వృధా కాకుండా సమస్యల పరిష్కారం కోసమే ఆన్ లైన్ సేవలు

ప్రజల, అధికారుల సమయం వృధా కాకుండా సమస్యల పరిష్కారం కోసమే ఆన్ లైన్ సేవలు

ఎవరైనా తమ అర్జీని ఆన్‌లైన్ ద్వారా ఉంచాలనుకుంటే యూజర్‌ లాగిన్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత ఆన్‌లైన్‌ సిటిజన్‌ లాగిన్‌ను క్లిక్‌ చేయాలి. ఆధార్‌ నంబర్‌ను నమోదు చేసుకోవాలి ఆ తరువాత ఆధార్‌‌కు మనం ఇచ్చిన ఫోన్ నంబర్‌కు ఓ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నంబర్‌ను అక్కడ నమోదు చేయగానే మనం చేయాల్సిన అర్జీ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో సమస్యల గురించి అర్జీ పెట్టుకోవాలి. ఇక ఆ తరువాత ఆ సమస్యను తర్వాత వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తారు. మనం అర్జీ పెట్టుకున్న సమస్య పరిష్కారం ఎక్కడ వరకు వచ్చింది అనే సమాచారం కూడా మనం అర్జీ స్టేటస్ లో తెలుసుకోవచ్చు. పెద్దగా ఇంగ్లీషు పరిజ్ఞానం లేనివారికి సైతం అర్థమయ్యేలా వెబ్ సైట్ ను రూపొందించారు. తెలుగు భాషలో కూడా ఈ వెబ్ సైట్ ద్వారా తమ సమస్యను ప్రభుత్వానికి నివేదించుకోవచ్చు. దీనివల్ల ప్రజల, అధికారుల సమయం వృథా కాకుండా ఉంటుంది అని భావిస్తోంది జగన్ సర్కార్. అందుకే స్పందన కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి నేరుగా దరఖాస్తులు తీసుకోవడమే కాకుండా, ఆన్లైన్ సేవలను, టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తెచ్చింది.

English summary
Citizens of Andhra Pradesh will now be able to register their grievances for redressal under the State government’s ‘Spandana’ initiative. After receiving a huge response from the public, the government has made the process of grievance redressal easier. “Every citizen of Andhra Pradesh with internet access may seek redressal of his/her grievance, from any department/ office/ officer in the government by visiting http:/spandana.ap.gov.in/online_user,”Those with a grievance can just visit the website, give the Aadhaar details and register their complaint. For the record, the YS Jagan Mohan Reddy government launched Spandana programme on July 1. Chief Minister Jagan has been personally taking stock of how the initiative is being implemented on a weekly basis. He had directed the officials to clear all applications without any delay.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X